RRR: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ నయా రికార్డ్.. ఏమిటంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండగా, ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల విధ్వంసకర పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల ఈ సినిమాను జపాన్‌లో భారీ అంచనాల మధ్య రిలీజ్ చేయగా.. అక్కడ కూడా ఆర్ఆర్ఆర్ తన సత్తా చాటుతోంది.

RRR: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండగా, ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల విధ్వంసకర పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
RRR: బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్
కాగా, ఇటీవల ఈ సినిమాను జపాన్‌లో భారీ అంచనాల మధ్య రిలీజ్ చేయగా.. అక్కడ కూడా ఆర్ఆర్ఆర్ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జపాన్ రిలీజ్ సందర్భంగా ఆ దేశంలో ఆర్ఆర్ఆర్ యూనిట్ సందడి చేసింది. తాజాగా ఆర్ఆర్ఆర్ జపాన్‌లో ఓ నయా రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్‌లో అత్యంత వేగంగా 300 మిలియన్ యెన్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ సినిమా అక్కడ ఇప్పటికే బాహుబలి-2 పేరుతో ఉన్న రికార్డును అధిగమించింది.
RRR : ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్.. గవర్నర్ అవార్డ్స్‌లో హాలీవుడ్ టాప్ డైరెక్టర్..
దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా అక్కడ టోటల్ రన్‌లో ఇంకా ఎలాంటి రికార్డులను తన పేరిట రాసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీం పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, ఆలియా భట్, శ్రియా, ఒలివియా మారిస్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.