SS Rajamouli: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇచ్చారు.. కానీ సైలెంట్ ఎందుకు?

జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అనగానే దాదాపు మూడు నెలల ముందు నుండే ఆర్ఆర్ఆర్ టీం ప్రచారం మొదలు పెట్టింది.

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇచ్చారు.. కానీ సైలెంట్ ఎందుకు?

Rrr

SS Rajamouli: జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అనగానే దాదాపు మూడు నెలల ముందు నుండే ఆర్ఆర్ఆర్ టీం ప్రచారం మొదలు పెట్టింది. సోషల్ మీడియా నుండి సినిమా అప్డేట్స్ వరకు ఒక్కొకటి వదులుతూ స్టార్స్ ఇంటర్వ్యూలతో మోత మోగించారు. చివరి నెల రోజులైతే హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్ కాలికి బలపం కట్టుకొని దేశం మొత్తం చుట్టేశారు. అయితే.. ఫైనల్ గా అప్పుడు సినిమా వాయిదా పడగా ఇప్పుడు రెండు డేట్స్ ఇచ్చారు.

Serial Actress: అర్ధరాత్రి తప్పతాగి సీరియల్ నటీనటుల రచ్చ.. అరెస్ట్!

ఆర్ఆర్ఆర్ టీం ప్రకటించిన రెండు డేట్స్ లో ఒకటి మార్చి 18 లేదా ఏప్రిల్ 29 ఉన్నాయి. వీటిలో మార్చి డేట్ దాదాపుగా నిజం కాకపోగా ఏప్రిల్ ఎండింగ్ లో ఈద్ వీకెండ్ కలిసి వచ్చేలా సినిమా రానుంది. ఇప్పుడు జనవరి పూర్తయింది. మిగిలింది ఫిబ్రవరి, మార్చి రెండు నెలలు మాత్రమే. మొన్నటి వరకు సినిమా మీద ఉన్న హైప్ ఇప్పుడు లేదు. సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ జనవరి ముహూర్తం స్థాయి హైప్ తగ్గింది.

NTR30: లీడర్ గా తారక్.. పొలిటికల్ స్పెషల్ గా కొరటాల సినిమా?

మరోవైపు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసే పనిలో ఉన్నారు. రాజమౌళి కూడా దాదాపుగా సైలెంట్ అయిపోయారు. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు నిరాశగా ఉన్నారు. ప్రేక్షకులలో హైప్ పెంచడంతో ఎక్స్పర్ట్ అయిన జక్కన్న ఇలా సైలెంట్ ఉండడం ఏంటి అన్న అయోమయంలో ఉన్నారు. సినిమా అప్డేట్స్ కూడా లేకుండా మరీ ఇంత సైలెంట్ ఉండడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి జక్కన్న ఫిబ్రవరి నుండి మొదలు పెడతారా లేక ఇంకా సైలెంట్ ఉంటారా అన్నది చూడాలి.