RRR : ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. 50 రోజుల్లో

ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. జనవరి 7న

RRR : ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. 50 రోజుల్లో

Rrr

RRR :  దేశం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎదురు చూస్తుంది. రాజమౌళి మ్యాజిక్ ని చూడటానికి సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ గా
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ఆర్ఆర్ఆర్’ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవ్వనుంది.

Chiranjeevi : చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి 25 లక్షల విరాళం.. వెంకయ్య నాయుడి చేతుల మీదుగా

అయితే ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రం అనౌన్స్ చేసి సరిగ్గా ఈరోజుతో నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుంది. నాలుగేళ్ల క్రితం 2017లో దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి సినిమాని అనౌన్స్ చేశారు. రాజమౌళి సినిమా అంటేనే ఆలస్యంగా వస్తుంది. దీనికి తోడు కరోనా రావడంతో ఈ సినిమా ఇంకా లేట్ అయింది.

Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పునీత్ భార్య

తాజాగా ట్విట్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ అధికారిక పేజీలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి ఫోటోని షేర్ చేసి.. ”సినిమా అనౌన్స్ చేసి నాలుగేళ్లు అయింది. సినిమా మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి అయింది. ఇంకో 50 రోజుల్లో వెండితెరపై ఈ సినిమా మ్యాజిక్ ని చూడండి. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. జనవరి 7న అని పోస్ట్ చేశారు”. ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.