Chiranjeevi : చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి 25 లక్షల విరాళం.. వెంకయ్య నాయుడి చేతుల మీదుగా

ఈ కార్యక్రమంలో యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్ రూ.25 లక్షల విరాళం ట్రస్ట్ సేవల కోసం చిరంజీవికి ఇచ్చారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు

Chiranjeevi : చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి 25 లక్షల విరాళం.. వెంకయ్య నాయుడి చేతుల మీదుగా

Chiru

Chiranjeevi :  ఎన్నో సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలతో ఎందరో ప్రాణాలని కాపాడారు. ఇటీవల కరోనా కాలంలో ఆక్సీజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసి ఎంతో మందిని బతికించారు. అయితే ఇన్ని రోజులు ఇవన్నీ కూడా తన సొంత డబ్బుతోనే నిర్వహించారు చిరంజీవి. అప్పుడప్పుడు అరుదుగా విరాళాలు వచ్చేవి.

Samantha : కేటీఆర్ పోస్ట్‌పై సమంత వ్యాఖ్యలు

తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి 25 లక్షల విరాళం అందింది. నిన్న యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ ని చిరంజీవి, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్ రూ.25 లక్షల విరాళం ట్రస్ట్ సేవల కోసం చిరంజీవికి ఇచ్చారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Nayanatara : ప్రియుడితో కలిసి అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న నయన్

దీనిపై చిరు మాట్లాడుతూ ”ఇది ఊహించలేదు. ఎన్నో సంవత్సరాలుగా నా సొంత రిసోర్సెస్ తోనే ట్రస్ట్ ని నడిపాను. ఈ మధ్య కాలంలో పెద్దలు ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవల్ని గుర్తించి కొంతమేర ఆర్థిక సాయాన్ని ప్రకటించడం చూసి సంతోషిస్తున్నాను. ఇది అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాము. ఇదే సమయంలో నా వ్యక్తిగత అభ్యర్థన. మా సినీపరిశ్రమలో చాలా మంది పేద కళాకారులు ఉన్నారు. వారంతా సరైన వైద్యం అందక ఇక్కట్లు పడుతున్నారు. మీ డయాగ్నసిస్ సెంటర్ ద్వారా వారికి సాయం చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

Jai Bheem : ‘జై భీమ్’ సినిమాపై సీతక్క ట్వీట్.. రిప్లై ఇచ్చిన సూర్య

దానికి ప్రతిస్పందనగా యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్.. మూవీ ఆర్టిస్టుల సంఘం సహా 24 శాఖల కార్మికులకు 50 శాతం తక్కువ ఖర్చులోనే ఆరోగ్య సేవలందిస్తామని అన్నారు. ఈ అంశాలపై మెగాస్టార్ ట్వీట్ చేసి వారిని అభినందించారు.