Republic : ఓటీటీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Republic : ఓటీటీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది?

Republic

Republic: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‏.. రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.

Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

‘రిపబ్లిక్’ సినిమాకి మెగా మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సపోర్ట్ అందించారు. చిరు, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే.. పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చారు. ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్, విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

Aha 2.0 : టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

చాలా చోట్ల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. నవంబర్ 26 నుండి జీ5లో ‘రిపబ్లిక్’ ప్రీమియర్ కాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 12.5 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా కేవలం 6.85 కోట్ల షేర్ రాబట్టి, బయ్యర్లకు 5.65 కోట్ల మేర నష్టాన్ని మిగిల్చింది. ఓటీటీలో ‘రిపబ్లిక్’ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.