Aha 2.0 : టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’ ఈవెంట్ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది..

Aha 2.0 : టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

Aha 2.0

Aha 2.0: బ్లాక్‌బస్టర్ సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే షో లతో తెలుగు ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన ‘ఆహా’, ప్రారంభించిన అతి తక్కువ టైం లోనే ప్రామిస్‌ని నిలబెట్టుకోవడమే కాకుండా.. డిజిటల్ రంగంలో నెవర్ బిఫోర్ అనేంతలా సత్తా చాటింది.

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

రోజురోజుకీ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటూ ఎన్ని ఓటీటీ మాధ్యమాలున్నా సరే తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది తొలి తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’.. ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి ‘ఆహా’ అప్‌గ్రేడ్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ‘ఆహా 2.0’ అవతరించనుంది.

Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

దీపావళికి ఎగ్జ‌ైట్‌మెంట్‌ను రెట్టింపు చేసేలా పండుగ ఆనందాల‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా ‘ఆహా’ యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో వీక్ష‌కుల‌కు అందిస్తూ సంబ‌రాల‌ను తీసుకొస్తుంది ‘ఆహా’. గత ఇర‌వై నెల‌లుగా కంటిన్యూగా తెలుగు ప్రేక్ష‌కుల‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంబ‌రాన్ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తూ న‌వంబ‌ర్ 2న హైద‌రాబాద్‌లో ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో పాపుల‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ షోను ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు.

Acharya : మణిశర్మ మెమరబుల్ మెలోడీ ‘నీలాంబరి’..

‘ఆహా’ ప్ర‌మోట‌ర్స్ అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, రామ్ రావ్ జూప‌ల్లి ‘ఆహా’లో ప్ర‌సారం కాబోయే సూప‌ర్‌హిట్ చిత్రాలు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, ల‌క్ష్య‌, మంచిరోజులొచ్చాయి, డీజే టిల్లు, రొమాంటిక్‌, అనుభ‌వించు రాజా, పుష్ప‌క విమానం, గ‌ని’ వంటి ఫిక్ష‌న‌ల్‌, నాన్ ఫిక్ష‌న‌ల్ సినిమాలతో పాటు ఆహా ఒరిజిన‌ల్స్ ‘అన్‌స్టాప‌బుల్‌, సేనాప‌తి, భామా క‌లాపం, త్రీరోజెస్’ వంటి చిత్రాల‌కు సంబంధించి కూడా వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.

Bholaa Shankar : మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ