Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

బాలయ్య అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తన స్టైల్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్ పేలుస్తూ.. హోస్ట్‌గా అదరగొట్టబోతున్నానని హింట్ ఇచ్చేశారు..

Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

Unstoppable

Updated On : October 31, 2021 / 6:30 PM IST

Unstoppable with NBK: తెలుగు ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తామని ప్రామిస్ చేసిన తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాక అంతకుమించి అనేలా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. బ్లాక్‌బస్టర్ సినిమాలు, పాపులర్ షోలు, ఆకట్టకునే వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మనసుల్లో తిరుగలేని స్థానాన్ని సంపాదించుకుంది.

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

బాలయ్య హోస్ట్‌గా నెవర్ బిఫోర్ అనేలా ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతుంది. ‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు’.. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అంటూ స్నీక్ పీక్‌తో సందడి చేసిన ‘ఆహా’ టీం ఆదివారం ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

కలెక్షన్ కింగ్, డా.మోహన్ బాబు ఫస్ట్ ఎపిసోడ్‌లో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారు. ప్రోమోలో బాలయ్యతో కలసి సందడి చేశారు మోహన్ బాబు. ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్ చేస్తూ మంచు లక్ష్మీ, విష్ణు కూడా యాడ్ అయ్యారు. బాలయ్య అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తన స్టైల్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్ పేలుస్తూ.. హోస్ట్‌గా అదరగొట్టబోతున్నానని హింట్ ఇచ్చేశారు.

Unstoppable Promo

 

Unstoppable with NBK : తర్వాత ఎపిసోడ్స్ గెస్టులు వీళ్లే..

‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విడుదల చేసిన క్షణాల్లో వైరల్‌గా మారడమే కాక ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కేవలం రెండు గంటల్లో 1 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం. ఇప్పటికి రెండు మిలియన్లకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైకులతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 4నుండి తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.