Love Story : ఆ ముద్దు సీన్లు ఎలా చేశామంటే..

‘లవ్ స్టోరీ’ సినిమాలో ముద్దు సీన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది సాయి పల్లవి..

Love Story : ఆ ముద్దు సీన్లు ఎలా చేశామంటే..

Love Story Kiss

Love Story: ఇప్పుడు ఎక్కడ చూసినా ‘లవ్ స్టోరీ’ పోస్టర్లో.. ఎవరి నోటా విన్నా ‘లవ్ స్టోరీ’ సినిమాకి సంబంధించిన ముచ్చట్లే.. పాండమిక్ తర్వాత థియేటర్లకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ చక్కటి కలెక్షన్లు రాబడుతూ.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచుతుంది ‘లవ్ స్టోరీ’..

Love Story : సరైన టైంలో సాలిడ్ హిట్ కొట్టిన చైతూ

ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవిల పర్ఫార్మెన్స్, సాంగ్స్, శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. చైతు – సాయి పల్లవిల కెమిస్ట్రీతో పాటు లవ్ సీన్స్.. ముఖ్యంగా ఇద్దరూ పోటాపోటీగా వేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఓ సీన్‌లో అలాగే ‘ఏయ్ పిల్లా’ పాటలోనూ సాయి పల్లవి, చైతుకి ముద్దు పెడుతుంది. సాధారణంగా కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయి పల్లవి ఎలా ముద్దు పెట్టిందబ్బా అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇటీవల ఓ ఇంటర్వూలో వాటి గురించి డీటెయిల్డ్‌గా చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Love Story Magical Success Meet : కింగ్‌కి సాయి పల్లవి సర్‌ప్రైజింగ్ హగ్..

‘నేనెప్పుడూ కూడా ముద్దు సీన్లలో యాక్ట్ చెయ్యలేదు.. అలాంటి సీన్స్‌లో నటించను అని దర్శక నిర్మాతలకు ముందే చెప్పేస్తాను.. నాకిష్టం లేదు కాబట్టి శేఖర్ కమ్ముల గారు ముద్దు సీన్ చెయ్యమని నన్ను ఇబ్బంది పెట్టలేదు.. నిజంగా నేను నాగ చైతన్యను ముద్దు పెట్టుకోలేదు.. కెమెరామెన్ అది ఒరిజినల్ ముద్దు సీన్ అనే ఫీల్ కలిగేలా కెమెరా యాంగిల్‌తో సెట్ చేశారు.. క్యారెక్టర్ బాగుంది అంటే పర్ఫార్మెన్స్ అనేది దానికదే బెటర్‌గా వచ్చేస్తుంది’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అలాగే ‘ఏవో ఏవో కలలే’ పాటలో రిస్క్‌తో కూడుకున్న జంపింగ్ షాట్స్ షూట్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్నాం.. ఎలాంటి రోప్స్ వాడలేదు.. తాను పైకెగిరినప్పుడు కెమెరాను లో యాంగిల్‌లో పెట్టి షూట్ చేశారని చెప్పింది సాయి పల్లవి..

Samantha : రూమర్లకు చెక్ పెట్టిన సామ్..