Love Story : సరైన టైంలో సాలిడ్ హిట్ కొట్టిన చైతూ

నాగ చైతన్య - సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది..

Love Story : సరైన టైంలో సాలిడ్ హిట్ కొట్టిన చైతూ

Love Story 50 Cr

Updated On : September 27, 2021 / 5:27 PM IST

Love Story: సరైన టైం లో సరైన సినిమా పడితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనే దానికి చక్కని ఉదాహరణగా నిలిచింది ‘లవ్ స్టోరీ’ సినిమా.. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్‌గా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పాండమిక్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా కావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాళ్లకు తరలి వచ్చారు. ఇక యూఎస్ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటిందీ సినిమా. 226 లొకేషన్లలో ప్రీమియర్స్ ద్వారా ‘వకీల్ సాబ్’ కలెక్షన్లను దాటేసింది. ఇప్పుడు 1 మిలియన్ మార్క్ కూడా దాటేసింది.

Love Story : పవన్ సినిమాను దాటేసిందిగా..

పాండమిక్‌కి ముందు వచ్చిన ‘జాతి రత్నాలు’ తర్వాత 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది ‘లవ్ స్టోరీ’ నే కావడం విశేషం. ఇక వరల్డ్ వైడ్‌గా కేవలం మూడు రోజుల్లో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్య పరిచింది ‘లవ్ స్టోరీ’. ముఖ్యంగా అక్కినేని అభిమానులు, యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

Love Story : పవన్‌ను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన రెహమాన్..