Love Story : పవన్‌ను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన రెహమాన్..

లవ్ స్టోరీ సినిమా గేమ్ ఛేంజర్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చెయ్యగా.. తన శిష్యుణ్ణి చూసి గర్వపడుతున్నానంటూ ఎ.ఆర్.రెహమాన్ రీ ట్వీట్ చేశారు..

Love Story : పవన్‌ను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన రెహమాన్..

Ar Rahman

Love Story: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన బ్యూటిఫుల్ లవ్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’ పాజిటివ్ టాక్‌తో, మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. పాండమిక్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనకు, శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకు చక్కటి అప్లాజ్ వస్తోంది. ముఖ్యంగా అందరూ మాట్లాడుతుంది మ్యూజిక్ గురించి.. యంగ్ అండ్ టాలెంటెడ్ పర్సన్ పవన్ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆయన తండ్రి విజయ్ కుమార్ ఈ సినిమాకి కెమెరామెన్ కావడం విశేషం.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

పవన్.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ దగ్గర వర్క్ చేశాడు. ఎంతో టాలెంటెడ్ పర్సన్ అని శేఖర్ కమ్ముల చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజ్‌కి ముందే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చాడు. ‘లవ్ స్టోరీ’ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా టీంను అభినందిస్తున్నారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా చూసి స్పందించారు.

Love Story : పవన్ సినిమాను దాటేసిందిగా..

‘నాగ చైతన్య పరిణితి చెందిన యాక్టర్‌లా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. సాయి పల్లవి ఎప్పుడూ సెన్సేషన్.. ఆమె ఒంట్లో ఎముకలు లేవేమో? ఆమెలా డ్యాన్స్ చేసిన వాళ్లను ఇప్పటివరకు నేను స్క్రీన్ మీద చూడలేదు.. పవన్ గురించి చాలా విన్నాను. అతని మ్యూజిక్ సెన్సేషనల్.. పవన్, రెహమాన్ దగ్గర పని చేశారని తెలిసింది.. రెహమాన్ సార్.. పవన్ లాంటి శిష్యుడు ఉన్నందుకు మీరు గర్వపడాలి.. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ గేమ్ ఛేంజర్’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

దీనికి ఎ.ఆర్.రెహమాన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ‘అవును మహేష్.. పవన్ సూపర్ టాలెంటెడ్ అండ్ హంబుల్.. నా KM Music Conservatory లో అన్నీ అతనే చూసుకునే వాడు. పవన్ సక్సెస్ చూసి నిజంగా మనం ప్రౌడ్‌గా ఫీలవ్వాలి’ అని రీ ట్వీట్ చేశారు. గురువు ప్రశంసలకు ఎమోషనల్ అవుతూ.. ‘థ్యాంక్యూ సో మచ్ సార్.. మీ సపోర్ట్, గైడెన్స్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.. KM Music Conservatory లో నేను చాలా నేర్చుకున్నాను’ అంటూ రీ ట్వీట్ చేశాడు పవన్..