SALAAR : పిచ్చెక్కించేలా ప్రీ-క్లైమాక్.. బడ్జెట్ ఎంతో తెలుసా!

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ‘సలార్’ ప్రీ-క్లైమాక్స్‌ను నెవర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట..

SALAAR : పిచ్చెక్కించేలా ప్రీ-క్లైమాక్.. బడ్జెట్ ఎంతో తెలుసా!

Salaar

SALAAR: రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. శృతి హాసన్ కథానాయిక.

Varun Tej : హ్యాపీ బర్త్‌డే ‘మెగా ప్రిన్స్’ వరుణ్ తేజ్

ఇప్పటికే కొంత భాగం షూట్ కంప్లీట్ చేసుకున్న ‘సలార్’ ను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పడక తప్పేలా లేదు. ‘కె.జి.యఫ్’ కు రెండింతలు యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ‘సలార్’ ఉంటుందని చెప్పి అంచనాలు పెంచేశారు మేకర్స్.

Thaman S : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కు థమన్ రీ రికార్డింగ్!

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ‘సలార్’ ప్రీ-క్లైమాక్స్‌ను నెవర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సలార్’ ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం అక్షరాలా 20 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారట. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ని థ్రిల్‌కి గురిచేస్తుందని చెప్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!