Salaar: అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే ‘సలార్’ ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ ఓవర్సీస్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందట.

Salaar: అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే ‘సలార్’ ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Salaar To Get This Much For Breakeven In North America

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీయఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండంతో ‘సలార్’ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ తనదైన స్టయిల్‌లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Salaar: సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోన్న సలార్.. ఎప్పుడొస్తుందంటే..?

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని సంచలనాలను క్రియేట్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్ మూవీపై నెలకొన్న హై ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా, ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌కు ఎవరూ ఊహించని విధంగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రభాస్‌కు పట్టున్న ఓవర్సీస్ మార్కెట్‌లో సలార్ నయా రికార్డులు క్రియేట్ చేస్తోందట. నార్త్ అమెరికాలో ఈ సినిమా రైట్స్‌ను రికార్డు రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఏకంగా 10 మిలియన్ డాలర్లు వసూలు చేయాలట.

Salaar: లాస్ట్ ఫినిషింగ్ ఇస్తోన్న సలార్.. ఇక దూకుడు పెంచడం ఖాయం!

నార్త్ అమెరికాలో ఈ స్థాయిలో బ్రేక్ ఈవెన్ ఫిగర్‌తో ఇండియన్ సినిమా రిలీజ్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది, ప్రభాస్ ‘సలార్’ మూవీతో కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తున్నాడని.. ఈ సినిమా గనక పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటే.. ఈ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకోవడమే కాకుండా, ఇండియన్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో నయా రికార్డులను తెచ్చిపెట్టడం పెద్ద విషయమేమి కాదంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.