Salaar: లాస్ట్ ఫినిషింగ్ ఇస్తోన్న సలార్.. ఇక దూకుడు పెంచడం ఖాయం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ ప్రస్తుతం చివరి స్టేజీకి చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

Salaar: లాస్ట్ ఫినిషింగ్ ఇస్తోన్న సలార్.. ఇక దూకుడు పెంచడం ఖాయం!

Salaar Shooting In Final Stage

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌‍టైనర్‌గా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట ఈ క్రేజీ డైరెక్టర్.

Salaar : రెండు భాగాలుగా సలార్.. కన్‌ఫార్మ్ చేసిన నటుడు దేవరాజ్!

దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రం ఫైనల్ స్టేజీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారని.. కొద్ది రోజులు మాత్రమే ఈ షెడ్యూల్ జరగనుండటంతో, ఈ చిత్ర షూటింగ్‌కు త్వరలోనే గుమ్మడికాయ కొట్టబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండటంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Salaar: సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా మారిన సలార్.. డిజిటల్ రైట్స్‌కే డబుల్ మ్యాజిక్..?

ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. విలక్షణ నటుడు జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ చిత్రానికి కేజీయఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.