Salaar : రెండు భాగాలుగా సలార్.. కన్‌ఫార్మ్ చేసిన నటుడు దేవరాజ్!

ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్. సలార్ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ఈ విషయాన్ని..

Salaar : రెండు భాగాలుగా సలార్.. కన్‌ఫార్మ్ చేసిన నటుడు దేవరాజ్!

Prabhas Salaar is in Two Parts confirmed by actor Devaraj

Salaar : ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ షెడ్యూల్ గురించి ఇటీవల ఇటలీ మీడియా ఆర్టికల్ రాస్తూ.. సలార్ రెండు భాగాలుగా రాబోతుంది అంటూ పేర్కొన్నారు. దీంతో సలార్ టు పార్ట్స్ గా రాబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసింది.

Project K : ప్రాజెక్ట్ K అప్డేట్.. సినిమాల్లో విలన్స్ వీళ్లేనా?? మరో ఆసక్తికర వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న దేవరాజ్.. ఈ విషయాన్ని కన్‌ఫార్మ్ చేశాడు. సీనియర్ యాక్టర్ అయిన దేవరాజ్ ఇటీవల ఒక తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తాను ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసిన దేవరాజ్.. మొదటి భాగంలో తన పాత్ర పెద్దగా కనిపించదని, సెకండ్ పార్ట్ లో తన పాత్ర ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించాడు. ఇక ఈ వ్యాఖ్యలు విన్న ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Prabhas : ప్రభాస్, మారుతీ సినిమా నుంచి ఫోటో లీక్.. గుబురు గడ్డంతో ప్రభాస్ డిఫరెంట్ లుక్!

కాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కూడా ఇటీవల బయటకి వచ్చింది. సలార్ ఎండ్ పార్ట్ లో యశ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపించాయి. కేజీఎఫ్ 2 ని కనెక్ట్ చేసేలా రాకీ భాయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. ఒకవేళ ఈ వార్త కూడా నిజమైతే బాక్స్ ఆఫీస్ ఊచకోత షురూ అంటున్నారు. ఇక సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించబోతున్నారు.