Prabhas : ప్రభాస్, మారుతీ సినిమా నుంచి ఫోటో లీక్.. గుబురు గడ్డంతో ప్రభాస్ డిఫరెంట్ లుక్!
ప్రభాస్, మారుతీ కలయికలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం నుంచి పిక్స్ లీక్ అయ్యాయి. ఆ ఫొటోలో ప్రభాస్ లుక్స్ అండ్ హీరోయిన్..

Prabhas Riddhi Kumar pic leak from director maruthi movie
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K, సలార్, మారుతీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ గ్యాప్ లేకుండా ఉంటున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం మారుతీ సినిమా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంచ్ కాకపోయినా సైలెంట్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటుంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పాత థియేటర్ సెట్ కూడా వేయించినట్లు తెలుస్తుంది.
Salaar: సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా మారిన సలార్.. డిజిటల్ రైట్స్‌కే డబుల్ మ్యాజిక్..?
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన రిద్ది కుమార్ (Riddhi Kumar), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటించబోతున్నట్లు వార్తలు వచినప్పటికీ, ఇప్పటి వరకు దీని పై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ అయ్యింది. ఆ ఫొటోలో ప్రభాస్, రిద్ది జంటగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్ అయితే గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ ని చూసిన రెబల్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ ని అందించేలా ఉన్నాడు అంటూ మారుతీని పొగిడేస్తున్నారు.
గతంలో కూడా ఈ మూవీ నుంచి కొన్ని పిక్స్ లీక్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ఎటువంటి ప్రమోషన్స్ అండ్ ప్రకటన చేయనప్పటికీ, ఈ లీక్ పిక్స్ సినిమా పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కాగా ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణల వివరాలు తెలియాల్సి ఉంది.
#Prabhas from the sets of #PrabhasMaruthi film ??
Vintage Rebel Star ??? pic.twitter.com/12rgnNqsqJ— Prabhas™ (@HYDPrabhasArmy) April 14, 2023