Salman Khan: ఎప్పుడూ లేనంతగా సినిమాల్ని లైనప్ చేస్తున్న సల్మాన్!

సిక్స్ టీకి దగ్గరవుతున్నా సల్మాన్ ఖాన్ మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే. 57 ఏళ్ల ఈ ఎవర్ యంగ్ హీరో ఎప్పటికీ అమ్మాయిల మోస్ట్ ఫేవరెట్ హీరోనే. అందుకే ఆడియన్స్ కోసం..

Salman Khan: ఎప్పుడూ లేనంతగా సినిమాల్ని లైనప్ చేస్తున్న సల్మాన్!

Salman Khan

Salman Khan: సిక్స్ టీకి దగ్గరవుతున్నా సల్మాన్ ఖాన్ మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే. 57 ఏళ్ల ఈ ఎవర్ యంగ్ హీరో ఎప్పటికీ అమ్మాయిల మోస్ట్ ఫేవరెట్ హీరోనే. అందుకే ఆడియన్స్ కోసం నెక్ట్స్ 2 ఇయర్స్ అదిరిపోయే విజువల్ ట్రీట్ ని రెడీ చేస్తున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. సల్మాన్ ప్రజెంట్ చేస్తున్న టైగర్ సీక్వెల్ తో పాటు వరసగా సినిమాలు లైన్లో పెట్టేస్తున్నాడు. పాము కరిచిందంటూ సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. టైగర్ జిందా హే అంటూ సేఫ్ గా ఉన్నానని మీడియాలో పోస్ట్ చేశారు.

Balakrishna: బాలయ్య ఓపెన్ ఆఫర్స్.. అందుకొనే దర్శకులెవరో?

ఎప్పటి లానే తన బర్త్ డే ని సింపుల్ గానే చేసుకున్న సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాల్ని లైనప్ చేస్తున్నారు. సల్మాన్ కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చిన ఏక్ థా టైగర్ సినిమాకి మరో సీక్వెల్ గా వచ్చింది టైగర్ జిందా హే. ఇప్పుడు ఆటైగర్ మూవీకి సీక్వెల్ టైగర్ 3ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు సల్మాన్ ఖాన్. టైగర్ 3 సినిమాతో పాటు.. షారూఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ లో కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ చేస్తున్న లాల్ సింగ్ చద్దాలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు సల్మాన్ ఖాన్.

Bigg Boss 5 Winner: సన్నీ మ్యారేజ్ ప్రపోజల్.. రూ.100 కోట్ల కట్నం!

ఫరాద్ సమ్జీ డైరెక్షన్లో సల్మాన్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న కభీ ఈద్, కభీ దివాళి సినిమా కూడా సెట్స్ మీద బిజీగా ఉంది. యాక్షన్ సినిమాలతో పాటు.. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో వచ్చిన నో ఎంట్రీ సినిమాకి సీక్వెల్ కూడా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. వీటితో పాటు కిక్ 2 ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు సల్మాన్ భాయ్. ఈ సినిమాలే కాకుండా తెలుగులో మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి హీరోగా చేస్తున్న గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీస్ తో పాటు కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన భజరంగీ భాయ్ జాన్ సినిమాకి కూడా సీక్వెల్ చేస్తున్నట్టు..అనౌన్స్ చేశారు సల్మాన్ ఖాన్.