Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తున్న మెగాస్టార్.. విలక్షణ కథలతో అలరించేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే మలయాళ..

Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!

Godfather

Godfather: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తున్న మెగాస్టార్.. విలక్షణ కథలతో అలరించేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే మలయాళ ‘లూసిఫర్’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ మెగా అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులలో కూడా అటెన్షన్ క్రియేట్ చేసింది.

Godfather: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ కోసం సల్లు భాయ్?

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘లూసీఫర్’ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఒరిజినల్ కథలో మార్పులు చేసి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. నయనతార మెగాస్టార్‌కి సిస్టర్‌గా ఈ సినిమాలో నటించబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ కూడా నటించనున్నాడు.

Pawan Kalyan : ‘గాడ్ ఫాదర్’తో ‘భీమ్లా నాయక్’.. ఒకరికోసం ఒకరు

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ సినిమా శనివారం నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ముంబై కజ్రత్‌లోని ఎన్‌డీ స్టూడియోలో జరగనున్న తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, సల్మాన్‌ పాల్గొననుండగా ఇక్కడే యాక్షన్‌ సీన్స్‌తో పాటు ఎమోషన్‌ సీన్స్‌ కూడా చిత్రీకరించనున్నారని టాక్‌. దాదాపు వారం పాటు ఈ షెడ్యూల్‌ షూటింగ్ జరగనుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తుంది.