Pawan Kalyan : ‘గాడ్ ఫాదర్’తో ‘భీమ్లా నాయక్’.. ఒకరికోసం ఒకరు

మెగాస్టార్ చిరంజీవి 'భీమ్లా నాయక్' సినిమాకి స్పెషల్ విషెష్ చెప్పారు. గతంలో గాడ్ ఫాదర్‌ సెట్లో భీమ్లా నాయక్, పవన్ కళ్యాణ్ మూవీ సెట్లో చిరంజీవి.. ఇలా మెగా బ్రదర్స్ ఇద్దరూ............

Pawan Kalyan : ‘గాడ్ ఫాదర్’తో ‘భీమ్లా నాయక్’.. ఒకరికోసం ఒకరు

God Father

Updated On : February 24, 2022 / 2:18 PM IST

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘భీమ్లా నాయక్’ సినిమాకి స్పెషల్ విషెష్ చెప్పారు. గతంలో గాడ్ ఫాదర్‌ సెట్లో భీమ్లా నాయక్, పవన్ కళ్యాణ్ మూవీ సెట్లో చిరంజీవి.. ఇలా మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకరి మూవీ షూటింగ్‌లో మరొకరు విజిట్ చేసిన వీడియోని సినిమాటిక్ గా ఎడిట్ చేసి పవన్ భీమ్లా నాయక్ కి విషెష్ చెప్తూ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్నసినిమా ‘గాడ్ ఫాదర్’ ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ జరిగే దగ్గర్లోనే జరగడంతో చిరంజీవి భీమ్లా నాయక్ సెట్ ని సందర్శించారు. భీమ్లా నాయక్ యూనిట్ పవన్ కళ్యాణ్, రానా, త్రివిక్రమ్, సాగర్ చంద్రలతో కలిసి చిరంజీవి ఫోటోలు దిగారు. గాడ్ ఫాదర్ షూటింగ్ డ్రెస్ లోనే కలవడం విశేషం. ఒక ఖైదీ డ్రెస్ లో చిరంజీవి ఉన్నారు. ఆయనకి కలిసొచ్చిన నంబర్ 786 ఆ ఖైదీ డ్రెస్ మీద ఉంది. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు ఈ సారి సినిమా మరో రేంజ్ లో ఉండబోతుందని ఆశిస్తున్నారు.

Bheemla Nayak: మాస్ కా బాస్.. యాక్షన్ బుల్లెట్లు దింపుతున్న పవర్ స్టార్!

ఆ తర్వాత ’గాడ్ ఫాదర్’ సెట్‌ను పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ యూనిట్‌ మెంబర్స్ త్రివిక్రమ్, సాగర్ చంద్రతో కలిసి విజిట్ చేశారు. ఈ సెట్‌లో కూడా చిరంజీవి ఖైదీ వేషంలోనే ఉన్నారు. ఇందులో ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా మలయాళం హిట్ సినిమాల రీమేక్ లు కావడం విశేషం. ఇలా ఒకరి సెట్ ని ఒకరు సందర్శించి అభిమానులకి మరింత ఉత్సాహాన్ని అందించారు. ఈ వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ‘గాడ్ ఫాదర్’ నుంచి ‘భీమ్లా నాయక్’కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.