Bheemla Nayak: మాస్ కా బాస్.. యాక్షన్ బుల్లెట్లు దింపుతున్న పవర్ స్టార్!

రావడం ఒక్కోసారి లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ తన మాస్ యాక్షన్ తో మరోసారి మెస్మరైజ్ చెయ్యడానికే ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్స్ నే టార్గెట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ యాక్షన్..

Bheemla Nayak: మాస్ కా బాస్.. యాక్షన్ బుల్లెట్లు దింపుతున్న పవర్ స్టార్!

Bheemla Nayak: రావడం ఒక్కోసారి లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ తన మాస్ యాక్షన్ తో మరోసారి మెస్మరైజ్ చెయ్యడానికే ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్స్ నే టార్గెట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ యాక్షన్ మూవీస్ తో తన మాస్ స్టామినా చూపించడానికి రెడీ అయ్యారు. రారా భీమ్లా అంటూ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ఈ మాస్ దేవుడు మాస్ పవర్ ని చూపించబోతున్నారు.

Bheemla Nayak: రిలీజ్‌కి ముందే దంచి కొట్టి.. కలెక్షన్స్‌తో అదరగొడుతున్న భీమ్లా!

పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. పేరు చెబితేనే పిచ్చెక్కి పోయే ఫ్యాన్స్ ఆయన సొంతం. అసలు ఆయన క్రేజ్ కి హిట్, ఫ్లాపులతో సంబందం లేదు. యాక్షన్ అంటే పవన్ కళ్యాణ్ అనే రేంజ్ లో క్రేజ్ ఉన్న పవర్ స్టార్.. తన ఫ్యాన్స్ కోసం ఈ సారి భీమ్లానాయక్ తో ఫుల్ గా యాక్షన్ ఫీస్ట్ రెడీ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో యాక్షన్ గన్ లోడ్ చేసుకుని బాక్సాఫీస్ లో కలెక్షన్ బుల్లెట్స్ దింపడానికి రెడీ అవుతున్నారు.

Bheemla Nayak: హిందీలో భీమ్లా రిలీజ్.. కానీ ప్రమోషన్ ఎక్కడ?

రీ ఎంట్రీ మూవీ ఒక్కటి సాఫ్ట్ గా కానిచ్చేసి.. పిక్చర్ అభీ బాకీ హే అంటూ యాక్షన్ తో రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో యాక్షన్ దమ్ము చూపిస్తున్న పవన్ కళ్యాణ్.. కంప్లీట్ గా తన ఫాన్స్ నే టార్గెట్ చేసుకున్నారు. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి దుమ్ము లేపే యాక్షన్ సీన్స్ వరకూ ప్రతీదీ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తోనే సినిమాని ఫిల్ చేశారు పవన్ కళ్యాణ్.

Bheemla Nayak: బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలే.. ఏపీ ప్రభుత్వం నోటీసులు

భీమ్లా నాయక్ సినిమాలో సబ్ ఇన్స్ పెక్టర్ గా మరోసారి తనకు బాగా అచ్చిచ్చిన మాస్ పోలీస్ రోల్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్ దగ్గరనుంచి మొన్నీ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ వీడియోలు సహా.. సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఈ రేంజ్ మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

Bheemla Nayak: థియేటర్స్‌పై భీమ్లా దండయాత్ర.. కలెక్షన్ల సునామీ ఖాయం?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక వకీల్ సాబ్ చేసినా అది ఈ రేంజ్ మాస్ మూవీ కాదు. కానీ ఈ సారి మాత్రం మాస్ జూలు విదిల్చి మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ ఈ రేంజ్ యాక్షన్ మూవీ చెయ్యలేదు పవన్ కళ్యాణ్. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు.. ఫాన్స్ కి పూనకాలొచ్చే మాస్ యాక్షన్ తో భీమ్లానాయక్ గా వస్తున్నారు.

Bheemla Nayak: సింగిల్ గా దూసుకొస్తున్న భీమ్లా.. తుఫాన్ తప్పదా?!

భీమ్లానాయక్ సినిమాలో మోస్ట్ క్రేజీ మాస్ యాక్షన్ హీరోగా పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నారు టీమ్. మాస్ కా బాస్ పవన్ కళ్యాణ్ అంటూ ఇప్పటికే ఫస్ట్ లుక్ చూసిన ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. 100 ఫైటర్లతో ఫైట్ చేస్తేనో, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటేనే మాస్ యాక్షన్ సినిమా అయిపోదు.. పవర్ ఫుల్ ఎంట్రీతో, సింపుల్ డైలాగ్స్ తో జస్ట్ లుక్స్ తోనే అంతా కంట్రోల్ చేసే కెపాసిటీ పవన్ కళ్యాణ్ ది. అందుకే పవన్.. క్లాస్ లుక్ ఉన్న మాస్ యాక్షన్ హీరోగా, ఫాన్స్ కి మాస్ దేవుడిగా ఫిక్స్ అయిపోయారు.