Bheemla Nayak: థియేటర్స్‌పై భీమ్లా దండయాత్ర.. కలెక్షన్ల సునామీ ఖాయం?

ఈ శుక్రవారమే పవర్ స్టార్ థియేటర్ ఎంట్రీ ఇచ్చేది. సో ప్రమోషనల్ స్పీడ్ పెంచిన మేకర్స్.. భీమ్లానాయక్ ట్రైలర్ తో ఆ జోష్ డబుల్ చేశారు. సో ఇంకేముంది మంచి ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్..

Bheemla Nayak: థియేటర్స్‌పై భీమ్లా దండయాత్ర.. కలెక్షన్ల సునామీ ఖాయం?

Bheemla Nayak

Updated On : February 22, 2022 / 4:55 PM IST

Bheemla Nayak: ఈ శుక్రవారమే పవర్ స్టార్ థియేటర్ ఎంట్రీ ఇచ్చేది. సో ప్రమోషనల్ స్పీడ్ పెంచిన మేకర్స్.. భీమ్లానాయక్ ట్రైలర్ తో ఆ జోష్ డబుల్ చేశారు. సో ఇంకేముంది మంచి ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ ను రిపీట్ మోడ్ లో ఎంజాయ్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు.

Bheemla Nayak : తమన్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. అన్నీ థియేటర్లోనే అంటున్న తమన్

మాస్ మసలా బూస్టప్ ఎలిమెంట్స్ తో భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. రికార్డులను తిరగరాసేలా పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఇప్పుడీ ట్రైలర్ ను ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే జరగాల్సిన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ఆంధ్రా మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణంతో బుధవారానికి వాయిదాపడింది. సో ఫ్యాన్స్ ను పూర్తిగా డిస్సాప్పాయింట్ చేయలేక ట్రైలర్ ను మాత్రం అనుకున్న టైమ్ కే తీసుకొచ్చారు మేకర్స్.

Bheemla Nayak: ‘నేను ఇవతల ఉంటే చట్టం.. అవతలికొస్తే కష్టం.. వాడికి’

తెలుగు రాష్ట్రాల్లో మరో తెలుగు సినిమా కనిపించనంతగా థియేటర్స్ ను స్టీల్ చేయబోతున్నారు పవర్ స్టార్. అడ్వాన్స్ బుకింగ్ జోరు చూస్తుంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది. అటు ఓవర్సీస్ లోనూ ఫుల్ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే యూఎస్ లో 3లక్షల డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది. 110 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో పాటూ అన్ని హక్కులు కలుపుకుని 180 కోట్ల వరకు సితారా ఎంటర్ టైన్ మెంట్ రాబట్టినట్టు తెలుస్తోంది. సింపుల్ గా బ్రేక్ ఈవెన్ సాధించినా.. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల సునామీ ఖాయంలా కనిపిస్తుంది.