Bheemla Nayak : తమన్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. అన్నీ థియేటర్లోనే అంటున్న తమన్

'భీమ్లా నాయక్' ట్రైలర్ ని నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ట్రైలర్ కి అన్ని వైపులా నుంచి మంచి స్పందన వస్తున్నా చాలా మంది ట్రైలర్ లో BGM బాగోలేదు అని, ఇంకా బాగా కొట్టొచ్చు అని...........

Bheemla Nayak :  తమన్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. అన్నీ థియేటర్లోనే అంటున్న తమన్

Thaman

 

Thaman :  పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా ‘భీమ్లా నాయక్’. నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ మాటలు రాయగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ట్రైలర్ ని నిన్న రాత్రి రిలీజ్ చేశారు.

 

ఈ ట్రైలర్ కి అన్ని వైపులా నుంచి మంచి స్పందన వస్తున్నా చాలా మంది ట్రైలర్ లో BGM బాగోలేదు అని, ఇంకా బాగా కొట్టొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ తమన్ అందిస్తున్నారు. ఇటీవల తమన్ అందించిన సినిమాలకి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది అని అందరూ అభినందించారు. ‘అఖండ’ సినిమా తమన్ మ్యూజిక్ వల్లే ఆడిందని, ఆ సినిమాకి తమన్ BGM బాగా ప్లస్ అయిందని కూడా అంతా అన్నారు. దీంతో పవన్ సినిమాకి కూడా అదే రేంజ్ లో ఆశించారు అభిమానులు. అయితే ట్రైలర్ లో BGM అనుకున్నంత లేకపోవటంతో పవన్ అభిమానులు నిరాశ చెందారు. తమన్ BGM ఇంకా బాగా ఇవ్వాలంటూ ట్విట్టర్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

Prabhas : ‘రాధేశ్యామ్’కి అమితాబ్ వాయిస్ ఓవర్.. సినిమాకి మరింత హైప్

దీంతో తమన్ ఈ ట్రోల్స్ కి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ”థియేటర్స్ లో ర్యాంప్ అమ్మా.. అన్నీ ట్రైలర్ లోనే ఆశిస్తే ఎలా? ఫారెస్ట్ ఫైర్ కి, లోకల్ ఫైర్ కి తేడా ఉండాలిగా.. కలుద్దాం..” అంటూ ట్రైలర్ లోని ఓ మాస్ బీట్ ని షేర్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు తమన్. దీంతో ‘భీమ్లా నాయక్’ సినిమాలో కూడా BGM భారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తమన్ పెట్టిన ట్వీట్ చూసి పవన్ అభిమానులు ఆనందిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.