Bheemla Nayak: ‘నేను ఇవతల ఉంటే చట్టం.. అవతలికొస్తే కష్టం.. వాడికి’

సితారా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో భీమ్లా నాయక్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ ను సోమవారం రాత్రి 9గంటలకు రిలీజ్ చేశారు.

Bheemla Nayak: ‘నేను ఇవతల ఉంటే చట్టం.. అవతలికొస్తే కష్టం.. వాడికి’
ad

Bheemla Nayak: సితారా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో భీమ్లా నాయక్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ ను సోమవారం రాత్రి 9గంటలకు రిలీజ్ చేశారు. నాయక్.. నీ ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ అంటూ రానా చెప్పిన డైలాగ్ కు పవన్ కల్యాణ్ వాకింగ్ కు ఫ్యాన్స్ కు మినీ పండుగను చూపించారు.

పవన్ కు జోడీగా నటిస్తున్న నిత్యామేనన్ డైలాగులు హీరో పవన్ కల్యాణ్, రానా డైలాగులే హైలెట్.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో రానా దగ్గుబాటి మరో హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని సాగర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ స‌ర్టిఫికేట్ దక్కించుకుంది.

Read Also: వారంటే మాకెంతో గౌరవం.. ‘భీమ్లానాయక్ నిర్మాత క్షమాపణలు’

వాస్తవానికి భీమ్లా నాయక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు(21 ఫిబ్రవరి 2022) హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. వాయిదా వేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ సంస్థ. మంత్రి మృతికి గౌరవ సూచకంగా భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్.

Read Also: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వాయిదా.. మేకపాటి మృతిపై పవన్ సంతాపం!