Samantha : పెళ్లి రోజు భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన సమంత..

సమంత తెల్ల‌ని డ్రెస్ ధ‌రించి నేల‌పై చూస్తూ ఒంటరిగా న‌డుస్తున్న ఫొటో షేర్ చేస్తూ స‌మంత పెట్టిన పోస్ట్ అందర్నీ ఆలోచింపచేస్తుంది

Samantha : పెళ్లి రోజు భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన సమంత..

Sam

Samantha :  గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా చై-సామ్ విడాకుల గురించే వినిపిస్తుంది. నాగ చైతన్య చాలా సైలెంట్ అని అందరికి తెలుసు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ పోస్టులు పెట్టడు, చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. విడిపోయేటప్పుడు ఇద్దరూ ఒకే పోస్ట్ పెట్టి విడిపోయారు. ఆ తర్వాత చైతన్య ఇప్పటిదాకా ఒక్క పోస్ట్ కానీ స్టోరీ కానీ పెట్టలేదు. సమంత మాత్రం రోజూ స్టోరీలు పెడుతుంది. తాజాగా ఇవాళ ఒక పోస్ట్ పెట్టింది.

చైతన్య – స‌మంతలు 2017లో అక్టోబర్‌ 6-7 తేదీల్లో హిందూ, క్రిస్టియ‌న్ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఇవ్వాళ వాళ్ళ నాల్గవ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవాలి. కానీ కొన్ని రోజుల క్రితమే విడిపోయారు. ప‌రిస్థితులు బాగుండి ఉంటే వాళ్ళు ఇవాళ యానివ‌ర్సరీ వేడుక జ‌రుపుకొని ఉండేవారు. ఇక వీళ్ళు విడిపోయాక అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెడుతున్నారా అని తెగ ఫాలో అవుతున్నారు. చైతన్య అసలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేడు. సమంత ఇవాళ ఒక ఫోటో షేర్ చేసి పాత జ్ఞాపకాలు అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

Junior NTR : హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్

తెల్ల‌ని డ్రెస్ ధ‌రించి నేల‌పై చూస్తూ ఒంటరిగా న‌డుస్తున్న ఫొటో షేర్ చేస్తూ స‌మంత పెట్టిన పోస్ట్ అందర్నీ ఆలోచింపచేస్తుంది. ఈ సింగిల్ ఫోటోకి పాత ప్రేమ పాటలు, పర్వతాలు, శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో వినిపించే ప్రతిధ్వని, ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు, పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి అర్ధం ఏంటో ఎవరికీ అర్ధం కావట్లేదు కానీ ఆ మాటలు చదివాక పాత జ్ఞాపకాలు అన్ని గుర్తు వస్తున్నాయని మాత్రం అర్ధమవుతుంది. ఈ పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇదే రోజూ గత సంవత్సరం సమంత త‌మ పెళ్లి రోజు సందర్భంగా నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేసి.. నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌ అని పోస్ట్ చేసింది. అభిమానులు ఆ పోస్ట్ ని ఇప్పుడు షేర్ చేస్తూ సంవత్సరం తిరగక ముందే ఆ మాటలు మారిపోయాయి అని కామెంట్స్ చేస్తున్నారు.