Samantha : బాలీవుడ్ కాదు.. ఏకంగా హాలీవుడ్‌కి ప్లాన్ చేసిన సమంత

'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సమంత బాలీవుడ్ లో కూడా ఫేమ్ తెచ్చుకుంది. అందరి సౌత్ హీరోయిన్స్ లాగే సమంత కూడా బాలీవుడ్ కి చెక్కేస్తోంది అనుకున్నారు. కానీ సమంత ఏకంగా హాలీవుడ్ కి ప్లాన్

Samantha : బాలీవుడ్ కాదు.. ఏకంగా హాలీవుడ్‌కి ప్లాన్ చేసిన సమంత

Samantha (1)

Samantha :  తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతున్న సమంత పెళ్లి చేసుకొని జోరు తగ్గించింది. పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా తక్కువ సినిమాలు చేసింది. ఇప్పుడు చైతన్యతో విడాకులు అవ్వడంతో మళ్ళీ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. తమిళ్ లో ఒక చిత్రం షూటింగ్ లో ఉంది. మరో రెండు తమిళ్, తెలుగు చిత్రాలకి సైన్ చేసింది ఇటీవలే.

Surya : మరోసారి సూర్య దాతృత్వం.. రియల్ సినతల్లికి 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో కూడా ఫేమ్ తెచ్చుకుంది. అందరి సౌత్ హీరోయిన్స్ లాగే సమంత కూడా బాలీవుడ్ కి చెక్కేస్తోంది అనుకున్నారు. కానీ సమంత బాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ గా చేయనున్నట్టు సమాచారం.

Samantha : మంచి రోజులు వస్తాయి.. గుర్తుంచుకోండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఇండియన్‌ రైటర్‌ టైమెరి ఎన్. మురారి ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే నవల రాసింది. దీనిని బ్రిటిష్‌-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా పబ్లిక్ చేశారు. 2004లో విడుదలైన ఈ నవల అప్పట్లో అత్యధికంగా అమ్ముడైంది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్‌కు కూడా ఈ నవల ఎంపికైంది. వీటికి ఎంపికైన ఏకైక ఇండియన్ నవలగా ఈ పుస్తకం రికార్డ్ సృష్టించింది.

Bigg Boss 5 : జెస్సి వెళ్ళిపోతూ కంటెస్టెంట్స్ కి సలహాలు.. నువ్వే నా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ..

ఇప్పుడు ఈ నవలని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీనిని ఫిలిప్‌ జాన్‌ అనే హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని సమంతతో ‘ఓ బేబీ’ సినిమా చేసిన నిర్మాతలు గురు ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్నారు. వాళ్ళతో సమంతకి మంచి సంబంధాలు ఉండటంతో సమంతని ఇందులో మెయిన్ లీడ్ గా అడిగినట్టు సమాచారం. ఇదే కనుక జరిగితే సమంత రేంజ్ మారిపోయినట్టే. సమంత అభిమానులు త్వరగా ఈ హాలీవుడ్ సినిమా చేయాలని కోరుకుంటున్నారు.