Samantha : మంచి రోజులు వస్తాయి.. గుర్తుంచుకోండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

సోషల్ మీడియాలో చై సామ్ బ్రేక్ అప్ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆపేసినా సమంత పోస్టుల గురించి మాత్రం మాట్లాడటం ఆపట్లేదు. మరో పక్క చైతన్య మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడు.

Samantha : మంచి రోజులు వస్తాయి.. గుర్తుంచుకోండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

Samantha

Samantha :  సమంత చైతన్యతో విడిపోయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది. అంతకు ముందు కేవలం తన ఫొటోస్, తన వర్క్ కి సంబంధించినవి మాత్రమే షర్ చేసేది. కానీ విడాకుల తర్వాత నుంచి ఎక్కువగా కొటేషన్స్ షేర్ చేస్తుంది. కొన్ని కొన్ని కొటేషన్స్ మగవాళ్ళకి వ్యతిరేకంగా, పెళ్లి గురించి, ప్రేమ గురించి, జీవితం, ఆనందం గురించి పెడుతుంది. ఇందులో కొన్ని కొటేషన్స్ తన ప్రస్తుత జీవితానికి అన్వయించేలా పెడుతుంది. దీంతో సమంత రోజూ చర్చల్లో నిలుస్తుంది.

Most Eligible Bachelor : ఆహాలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

సోషల్ మీడియాలో చై సామ్ బ్రేక్ అప్ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆపేసినా సమంత పోస్టుల గురించి మాత్రం మాట్లాడటం ఆపట్లేదు. మరో పక్క చైతన్య మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడు. దీంతో సమంత మరీ ఓవర్ గా రియాక్ట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా మరో పోస్ట్ పెట్టి అందరిని తన గురించి మాట్లాడేలా చేసింది.

Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్

తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ‘ఎప్పుడూ మంచి మన కోసం వస్తుంది.. అది గుర్తుంచుకోండి’ అంటూ ఉన్న ఇంగ్లీష్ కొటేషన్ ని షేర్ చేసింది. మరి ఇది ఎవర్ని ఉద్దేశించి షేర్ చేసిందో సమంతకు తెలియాలి. బాధల నుంచి విముక్తి పొంది మంచిరోజుల కోసం వేచి చూడాలనే అర్థంతో ఈ కొటేషన్ ఉంది. సమంత ఇలా రోజూ కొటేషన్స్ షేర్ చేయడంతో అందరి అటెన్షన్ ని తన వైపుకి తిప్పుకుంటుంది. ఈ కొటేషన్ తో మరోసారి అందరు సమంత గురించి చర్చించుకుంటున్నారు. ఇలాంటి కొటేషన్స్ పెట్టడం ఎప్పుడూ ఆపేస్తుందా అని అనుకుంటున్నారు అంతా.