Pushpa : పాన్ ఇండియానా బొక్కా అంటూ ట్వీట్.. సమంత రిప్లై..

అమెరికాలోని ఫ్లోరిడాలో అల్ట్రా మైమీ పేరుతో ఓ గ్రాండ్‌ మ్యూజిక్ ఫెస్టివల్‏ను నిర్వహిస్తారు. తాజాగా నిర్వహించిన ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ లో 'పుష్ప' సినిమాలోని సమంత.................

Pushpa : పాన్ ఇండియానా బొక్కా అంటూ ట్వీట్.. సమంత రిప్లై..

Samantha

 

Samantha :  సుక్కు, బన్నీ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినిమాలోని పాటలు, అందులోని స్టెప్స్ బాగా వైరల్ అయ్యాయి. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల వరకు ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించాయి. ఇప్పటికి కూడా చాలా చోట్ల ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి, ఊ అంటావా సాంగ్స్ మారుమ్రోగుతున్నాయి.

 

‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా…’ అంటూ ‘పుష్ప’ సినిమాలోని ఈ ఐటెం సాంగ్ కి సమంత ఆడి పాడి అలరించింది. ఈ పాట క్రేజ్ ఇంకా తగ్గలేదు అని మరోసారి రుజువైంది. ప్రతి సంవత్సరం అమెరికాలోని ఫ్లోరిడాలో అల్ట్రా మైమీ పేరుతో ఓ గ్రాండ్‌ మ్యూజిక్ ఫెస్టివల్‏ను నిర్వహిస్తారు. కొన్ని వేలమంది ఈ ఈవెంట్ కి వస్తారు. ఈ వేడుక చాలా ఘనంగా జరుగుతుంది. తాజాగా నిర్వహించిన ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ లో ‘పుష్ప’ సినిమాలోని సమంత నటించిన ఊ అంటావా.. ఊ ఊ అంటావా పాటను ప్రదర్శించారు.

KGF Chapter 2 : బెంగుళూరులో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ లాంచ్.. హైలెట్స్ ఇవే..

దీనికి అక్కడి జనాలు కూడా బాగా స్పందించారు. అమెరికాలో ఉన్న కొంతమంది తెలుగు వాళ్ళు దీనిని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ నెటిజన్ ట్విట్టర్లో ఈ వీడియోని షేర్ చేసి.. ”పాన్ ఇండియానా బొక్కా, పాన్ వరల్డ్ పుష్ప..” అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాక దీనికి సమంతని, అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశాడు. ఇది చూసిన సమంత ఈ వీడియోని షేర్ చేస్తూ ఇది నిజమేనా అంటూ ఆశ్చర్యంగా పోస్ట్ పెట్టింది.

RRR : ఫ్యాన్స్ ఆ పని చేయకండి.. ‘ఆర్ఆర్ఆర్’ టీం రిక్వెస్ట్

ఆ తర్వాత ఈ వీడియోల్ని మరో సారి చెక్ చేసుకొని మరికొన్ని వీడియోలు రాగా వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో పోస్ట్ చేసింది. అమెరికాలోని ఇలాంటి మ్యూజిక్ ఫెస్టివల్ లో తన పాట వినిపించడం సంతోషంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. మరి కొన్ని వీడియోల్ని పోస్ట్ చేస్తూ వాటికి అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ లని కూడా ట్యాగ్ చేయగా వాళ్ళు కూడా ఈ వీడియోల్ని స్టోరీలో పోస్ట్ చేశారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇవి ఫేక్ వీడియోలు, అక్కడి వీడియోలకు ఊ అంటావా సాంగ్ ని జత చేసి ప్రమోట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.