RRR : ఫ్యాన్స్ ఆ పని చేయకండి.. ‘ఆర్ఆర్ఆర్’ టీం రిక్వెస్ట్

'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు, హీరోల ఎంట్రీ సీన్స్, సాంగ్స్, ఇంటర్వెల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు.. ఇలాంటి అన్నిటిని కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఫోన్స్ లో.......

RRR : ఫ్యాన్స్ ఆ పని చేయకండి.. ‘ఆర్ఆర్ఆర్’ టీం రిక్వెస్ట్

Rrr

 

RRR :  చరణ్, తారక్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వీకెండ్ కావడంతో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక కలెక్షన్లు కూడా భారీగా సాధిస్తుంది ఈ సినిమా. అయితే మొదటి రోజు నుంచి కూడా అభిమానులు ఈ సినిమా చూస్తూ అత్యుత్సాహంతో కొంతమంది సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలని ఫోన్స్ లో చిత్రీకరిస్తున్నారు.

 

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు, హీరోల ఎంట్రీ సీన్స్, సాంగ్స్, ఇంటర్వెల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు.. ఇలాంటి అన్నిటిని కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో, వాట్సాప్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా పోస్ట్ చేస్తూ ఇప్ప‌టివ‌ర‌కు సినిమాను చూడ‌ని ప్రేక్ష‌కుల‌కు ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారు. ఇలా వాట్సాప్ స్టేటస్ లు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలోనే చాలా మంది సగం సినిమా చూసేస్తున్నారు.

KGF 2 Trailer : వైలెన్స్.. వైలెన్స్.. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ విడుదల..

ఈ విష‌యంపై ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ స్పందించారు. ఈ సినిమా నిర్మాతలైన డివివి ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ లో దీనిపై ట్వీట్ చేశారు. ”డియర్ ఫ్యాన్స్ సినిమాలోని సీన్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మ్యాజిక్‏ను స్క్రీన్ పై చూసి మీరు ఎంజాయ్ చేసినట్టుగానే ఇతరులు కూడా ఎంజాయ్ చేయాలి’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరి ఈ పోస్ట్ చూసి కొంతమంది అయినా ఇక నుంచి సినిమా హాళ్ళో రికార్డు చేయడం ఆపుతారేమో చూడాలి.