Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు శుభవార్త.. ఒక్కో రైతు బ్యాంక్ ఖాతాలో రూ.7వేలు.. డబ్బులు పడకుంటే ఇలా చేయండి
Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు శుభవార్త. ఒక్కో రైతు ఖాతాలో నేడు రూ.7వేలు జమ కానున్నాయి.
Annadata Sukhibhava
Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు శుభవార్త. ఒక్కో రైతు ఖాతాలో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. కేంద్రం ప్రభుత్వం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయనుంది. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ప్రతీయేటా రూ.6వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని రూ.2వేలు చొప్పున మూడు విడుతల్లో జమ చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత నిధులను నేడు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పీఎం కిసాన్ పథకం నిధులను గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం విడుదల చేయనున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పీఎం కిసాన్ నిధులతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను జమ చేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీయేటా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 14వేలు జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే.. రెండు విడతల్లో రూ.5వేలు చొప్పున.. మూడో విడతలో రూ.4వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలను ఇవాళ, రేపు అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమకానున్నాయి.
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ప్రత్యేక కార్యక్రమాలు లేకుండా.. నేరుగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ కానున్నాయి.
