Samantha : ప్రీతమ్, సమంతను ఏమని పిలుస్తాడో తెలుసా?..

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..

Samantha : ప్రీతమ్, సమంతను ఏమని పిలుస్తాడో తెలుసా?..

Preetham Jukalker

Samantha: ఇప్పుడు ఎక్కడ చూసినా నాగ చైతన్య – సమంతల విడాకుల వ్యవహారానికి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. భార్యభర్తలుగా విడిపోయినా కానీ తమ మధ్య స్నేహ బంధం కొనసాగుతుందని ఇద్దరూ హుందాగా చెప్పినా కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు.

Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?

సమంతకి సపోర్ట్‌గా ఆమె ఫ్యాన్స్, చైతుకి సపోర్ట్‌గా అతని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. అయితే చై – సామ్ విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతగాణ్ణి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. ట్రోల్స్ చేస్తున్న వాళ్లకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

ChaySam : సంసారాలన్నీ రచ్చబండలు.. బతుకు జట్కా బండ్లే.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..

‘ప్రీతమ్.. సమంతను జీజీ (అక్క) అని పిలుస్తాడు.. జీజీ అంటే అర్థం తెలుసు కదా?.. దేవుడు నాకు తెలివి ఇచ్చాడు.. దాన్ని కొందరు తెలివిలేని వాళ్లకు పంచుదామని’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది సాధనా సింగ్.

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..