Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్??

స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమాలు ఒప్పుకునేటప్పుడు నిర్మాతలకి, డైరెక్టర్స్ కి కొన్ని కండిషన్స్ పెడతారు. తాజాగా సమంత కూడా కొన్ని కొత్త కండిషన్స్ పెడుతుందని సమాచారం. విడాకుల తరువాత

Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్??

Sam

Samantha :  పెళ్లి అయిన తర్వాత నుంచి సమంత సినిమాల వేగం తగ్గింది. చేసే సినిమాలు కూడా సెలెక్ట్ చేసుకొని చేసింది. ఇక తాజాగా చైతన్యతో విడాకులు అవ్వడంతో వరుస సినిమాలని ప్రకటిస్తుంది. మొన్న దసరా సందర్భంగా తన నెక్స్ట్ రెండు సినిమాలని ప్రకటించింది. దీంతో ఇప్పుడు సమంత చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, మరోటి తమిళ్ సినిమా ఈ రెండు కాకుండా మొన్న పండగ సందర్భంగా అనౌన్స్ చేసిన రెండు సినిమాలు సమంత చేస్తుంది.

Sonia Gandhi : సోనియా గాంధీ బయోపిక్.. వచ్చే ఎలక్షన్స్ కి ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ??

సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమాలు ఒప్పుకునేటప్పుడు నిర్మాతలకి, డైరెక్టర్స్ కి కొన్ని కండిషన్స్ పెడతారు. తాజాగా సమంత కూడా కొన్ని కొత్త కండిషన్స్ పెడుతుందని సమాచారం. విడాకుల తరువాత సమంత ఇలాంటి కండిషన్స్ ని తన నెక్స్ట్ సినిమాలకి పెడుతుందని ఇండస్ట్రీ టాక్. ఆ షరతులు ఏంటంటే.. షూటింగ్ ల కోసం మెజారిటీ పార్ట్ చెన్నై లేదా ఆ చుట్టుపక్కల లొకేషన్లను ఎంచుకోవాలని, హైదరాబాద్ లోకల్ లో మాత్రం షూటింగ్స్ వద్దని, ఒకవేళ హైదరాబాద్ లో చేయాల్సి వస్తే కేవలం ఇండోర్ షూట్ మాత్రమే ప్లాన్ చేయాలని, ఇండోర్ లొకేషన్లు లేదా సెట్స్ వేసి షూట్ చేయాలని దర్శకులకి, నిర్మాతలకి చెప్తుంది సమంత.

Pelli Sandadi : వివాదంలో ‘పెళ్లి సందD’ హీరోయిన్.. తను నా కూతురు కాదంటూ..

అయితే విడాకుల తర్వాత సమంతని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రోల్స్ కి సమంత కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇక బయట లొకేషన్స్ లో షూట్ చేస్తే ఆ షూటింగ్ చూడటానికి వచ్చే వాళ్ళు కామెంట్లు చేసే అవకాశం ఉంది. అందుకే సామ్ ఈ కండిషన్ ని పెడుతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాబట్టి సమంత అడిగే కండిషన్స్ కి దర్శక నిర్మాతలు ఒప్పుకునే ఛాన్స్ ఉంది.