Sonia Gandhi : సోనియా గాంధీ బయోపిక్.. వచ్చే ఎలక్షన్స్ కి ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ??

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జీవిత కథను తెరపైన చూపించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. రాజీవ్ గాంధీ భార్యగా ఇండియాకి వచ్చి ఆయన మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ని నిలబెట్టి,

Sonia Gandhi : సోనియా గాంధీ బయోపిక్.. వచ్చే ఎలక్షన్స్ కి ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ??

Sonia

Sonia Gandhi :  ఇటీవల అన్ని పరిశ్రమలోనూ బయోపిక్ ల హడావిడి నడుస్తుంది. బాలీవుడ్ లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంది. సినిమా, క్రీడా, రాజకీయ రంగాలలో ప్రముఖుల జీవితాలని తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ లకి మంచి డిమాండ్ కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖుల బయోపిక్ లు వచ్చాయి. తాజాగా మరో రాజకీయ నాయకురాలి జీవితాన్ని సినిమాగా చూపించబోతున్నారు.

Manchu Lakshmi : నెటిజన్లపై సీరియస్ అయిన మంచు లక్ష్మి..

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జీవిత కథను తెరపైన చూపించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. రాజీవ్ గాంధీ భార్యగా ఇండియాకి వచ్చి ఆయన మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ని నిలబెట్టి, ఇప్పుడు ఓడిపోతున్నా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పార్టీ ని ముందుండి నడిపించే ఆమె జీవితాన్ని బయోపిక్ గా తీయాలని అనుకుంటున్నారు. ఓ బాలీవుడ్ దర్శకుడు ఈ బయోపిక్ ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ బయోపిక్ ని ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీనే నిర్మిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ దర్శకుడు ఆమె జీవిత చరిత్రని సేకరించే పనిలో పడ్డాడు. అలాగే ఢిల్లీకి చెందిన ఒక నటిని ఈ బయోపిక్ లో సోనియా గాంధీ పాత్రకి తీసుకున్నట్టు సమాచారం.

Pelli Sandadi : వివాదంలో ‘పెళ్లి సందD’ హీరోయిన్.. తను నా కూతురు కాదంటూ..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలని ఈ సినిమాని వచ్చే ఎలక్షన్స్ నాటికి సిద్ధం చేసి ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు ఆ కాంగ్రెస్ ఎంపీ. కాంగ్రెస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఆవిడ ఇండియా వచ్చిన దగ్గరనించి ఇప్పటి వరకు జరిగిన మొత్తం చూపిస్తారని అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ బయోపిక్ ఎంతవరకు విజయం సాధిస్తుందో.