Samantha : ఆ విషయంలో సమంత నంబర్ 1.. విడాకులతో కలిసొచ్చిందా??

నాగచైతన్య చాలా సైలెంట్ గా ఉంటాడు. బయటే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా సైలెంట్ గా ఉంటాడు. సమంత మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది

Samantha : ఆ విషయంలో సమంత నంబర్ 1.. విడాకులతో కలిసొచ్చిందా??

Samantha

Samantha :  గత కొద్దీ రోజుల నుంచి టాలీవుడ్ లో, సోషల్ మీడియాలో, బయట జనాల్లో కూడా ఎక్కడ చూసినా చై-సామ్ విడాకుల గురించే టాపిక్ నడుస్తుంది. వీళ్ళ విడాకులపై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. నాగ చైతన్య, సమంత మాత్రం విడిపోతున్నాము అని చెప్పేసి ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నాగచైతన్య చాలా సైలెంట్ గా ఉంటాడు. బయటే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా సైలెంట్ గా ఉంటాడు. సమంత మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది. తన సినిమాలు, తన బిజినెస్ లు, తన పర్సనల్ ట్రిప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.

ఇక విడాకులకు ముందు, తర్వాత కూడా సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది. రోజూ స్టోరీల్లో తన లైఫ్ కి అన్వయించేలా కొటేషన్స్ పెడుతుంది. మామూలుగానే సమంతకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక విడాకుల తర్వాత ఇది మరింత పెరిగింది అని సమాచారం. విడాకుల సమయంలో వీళ్ళిద్దరూ పెట్టిన పోస్టులకి బాగానే స్పందన వచ్చింది. కానీ నాగ చైతన్య కేవలం తెలుగు వరకే పరిమితం. సమంతకి మాత్రం తెలుగు, తమిళ్, హిందీలో కూడా ఫాలోయింగ్ ఉంది. దీంతో సమంత పెట్టే పోస్టులకి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. విడాకుల తర్వాత ఆమెని ఫాలో అయ్యేవారి సంఖ్య ఇంకా పెరిగింది.

Pooja Hegde : ఆధ్యాత్మిక యాత్రలో బుట్టబొమ్మ

విడాకుల తర్వాత సమంత రేంజ్ కొంచెం పెరిగింది అనే చెప్పొచ్చు. మొన్నటివరకు ఫాలోయింగ్ లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కలిపి కాజల్ అగర్వాల్ టాప్ ప్లేస్ లో ఉంటే తాజాగా విడుదల అయిన సమాచారం ప్రకారం ఇప్పుడు సమంత టాప్ ప్లేస్ లో ఉంది. కాజల్ సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది. దీంతో సోషల్ మీడియాలో నెంబర్ 1 గా నిలిచింది సమంత. విడాకులు అయినా తన క్రేజ్ మాత్రం తగ్గేదేలే అంటుంది సమంత.