Samantha : శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. సమంత వస్తుందా??

సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. తాజాగా శాకుంతలం ట్రైలర్ ని........

Samantha : శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. సమంత వస్తుందా??

Samantha shakunthalam movie trailer releasing date announced

Samantha :  సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల యశోద సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. అయితే అదే సమయంలో తనకి మయోసైటిస్ సోకిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సామ్. దీంతో అభిమానులు, ప్రేక్షకులు, ప్రముఖులు అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే తనకి మయోసైటిస్ వచ్చిన దగ్గర్నుంచి అసలు బయటకి రావట్లేదు సమంత. ప్రస్తుతం ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టీవ్ గా ఉండట్లేదు సమంత. తాజాగా శాకుంతలం డబ్బింగ్ స్టార్ట్ చేశాను అని రెండు రోజుల క్రితమే ఓ పోస్ట్ పెట్టింది సామ్. అలాగే శుక్రవారం నాడు ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్.

Jackie Shroff : థియేటర్స్‌లో పాప్‌కార్న్‌కి 500 తీసుకుంటున్నారు.. తగ్గించండి సార్ అంటూ సీఎంని అడిగిన స్టార్ యాక్టర్..

తాజాగా శాకుంతలం ట్రైలర్ ని జనవరి 9న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని PVR RK సినీప్లెక్స్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఈ ఈవెంట్ కి సమంత వస్తుందా రాదా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆలోచిస్తున్నారు. సమంత మాయోసైటిస్ తో ఇంటి దగ్గర చికిత్స తీసుకుంటుంది అన్నారు, కానీ ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. చాలా రోజుల తర్వాత జనాల్లోకి వచ్చింది సామ్. దీంతో సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వస్తుందనే అనుకుంటున్నారు అంతా. చిత్ర యూనిట్ మాత్రం దీనిపై స్పందించలేదు.