Jackie Shroff : థియేటర్స్‌లో పాప్‌కార్న్‌కి 500 తీసుకుంటున్నారు.. తగ్గించండి సార్ అంటూ సీఎంని అడిగిన స్టార్ యాక్టర్..

జాకీష్రాఫ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడుతూ.. థియేటర్లలో పాప్‌కార్న్‌ కి 500 రూపాయలు తీసుకుంటున్నారు.దయచేసి పాప్‌కార్న్‌ ధరలు తగ్గించండి. సినిమా టికెట్ కంటే పాప్‌కార్న్‌ రేటు ఎక్కువగా ఉంటే సినిమా.................

Jackie Shroff  : థియేటర్స్‌లో పాప్‌కార్న్‌కి 500 తీసుకుంటున్నారు.. తగ్గించండి సార్ అంటూ సీఎంని అడిగిన స్టార్ యాక్టర్..

jackie shroff requesting UP CM Yogi Adityanath for reducing PopCorn Rates in Theaters

Jackie Shroff :  తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ లో షూటింగ్స్ చేసుకోండి అంటూ బాలీవుడ్ వాళ్ళని ఆహ్వానించడానికి వచ్చారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన్ని కలిశారు. యోగి ఆదిత్యనాథ్ ముంబై పర్యటనలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. సునీల్‌ శెట్టి, రవికిషన్‌, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, సోనూ నిగమ్, బోనీ కపూర్‌ తో పాటు మరింతమంది బాలీవుడ్ ప్రముఖులు ఆయన్ని కలిశారు.

ఈ మీటింగ్ లో బాలీవుడ్ సినిమాలు, సమస్యల గురించి, ఇటీవల వస్తున్న విమర్శల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే దేశ సంసృతి, సమగ్రత, అభివృద్ధి రూపంలో కూడా బాలీవుడ్ సినిమాల గురించి చర్చించారట. ఉత్తరప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్స్ సమస్యలు, అక్కడ షూటింగ్స్ గురించి చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా జాకీష్రాఫ్ ఓ ఆసక్తికర విషయాన్ని మాట్లాడారు.

జాకీష్రాఫ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడుతూ.. థియేటర్లలో పాప్‌కార్న్‌ కి 500 రూపాయలు తీసుకుంటున్నారు.దయచేసి పాప్‌కార్న్‌ ధరలు తగ్గించండి. సినిమా టికెట్ కంటే పాప్‌కార్న్‌ రేటు ఎక్కువగా ఉంటే సినిమా చూడటానికి ఎవరు వస్తారు? పాప్‌కార్న్‌ రేటు వాళ్ళ కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గిపోతుంది అని అన్నారు. దీంతో జాకీష్రాఫ్ చేసిన వ్యాఖ్యలకి అక్కడున్న వాళ్లంతా నవ్వారు, ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Balakrishna : బాలకృష్ణకి తప్పిన పెను ప్రమాదం.. పొగమంచు వల్ల హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..

సోషల్ మీడియాలో జాకీష్రాఫ్ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. చాలామంది జాకీష్రాఫ్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా దీని గురించి అన్ని సినీ పరిశ్రమలలోని చర్చ జరిగింది. బయట 20 నుంచి 50 రూపాయలకి దొరికే పాప్‌కార్న్‌ ని థియేటర్స్, మల్టీప్లెక్స్ లలో 300 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. దీనిపై ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నా రేట్లు మాత్రం తగ్గించడం లేదు.