Samantha : విజయ్‌తో సమంత నాలుగోసారి??

సమంత చైతూతో విడాకుల తర్వాత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. అన్ని భాషల్లోనూ సినిమాలు, సిరీస్ లు ఒప్పుకుంటూ బిజీబిజీగా మారుతుంది. ఇప్పటికే పలు సినిమాలు...........

Samantha : విజయ్‌తో సమంత నాలుగోసారి??

Samantha

Vijay :  సమంత చైతూతో విడాకుల తర్వాత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. అన్ని భాషల్లోనూ సినిమాలు, సిరీస్ లు ఒప్పుకుంటూ బిజీబిజీగా మారుతుంది. ఇప్పటికే పలు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరిన్ని ఓకే చేసి పెట్టింది. ఇప్పుడు సమంత చేతిలో దాదాపు అరడజనుపైగానే ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా సమంత మరో సినిమాకి ఓకే చెప్పబోతున్నట్టు తెలుస్తుంది.

కమల్ హాసన్ ‘విక్రమ్‌’ సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. వరుస హిట్స్ మీద ఉన్న ఈ యువ తమిళ దర్శకుడు నెక్స్ట్ తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయనున్నాడు. విజయ్ ప్రస్తుతం తన 66వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు. ఇది అయిన తర్వాత విజయ్ 67వ సినిమా లోకేష్ తో చేయనున్నట్టు సమాచారం.

Nagababu : చిరంజీవి మద్దతు జనసేనకే.. మెగా అభిమానుల మద్దతు వారి ఇష్టం.. నాగబాబు వ్యాఖ్యలు..

అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఇప్పటికే లోకేష్ సమంతని కలిసినట్టు సమాచారం. లోకేష్ నిన్న శుక్రవారం వరకు విక్రమ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ బిజీ అయిన తర్వాత సమంతను మరోసారి కలిసి కథ చెప్పనున్నట్టు తెలుస్తుంది. సమంత ప్రస్తుతం అన్ని సినిమాలు ఒప్పుకుంటుంది, ఇక స్టార్ హీరో అయితే కచ్చితంగా ఒప్పుకుంటుంది కాబట్టి ఈ సినిమా కూడా ఒప్పుకునే అవకాశం ఉందని సమంత సన్నిహితులు అంటున్నారు. విజయ్ 67వ సినిమాలో సమంత హీరోయిన్ గా ఒప్పుకుంటే వీళ్లిద్దరు కలిసి చేసే నాలుగో సినిమా అవుతుంది. ఇప్పటికే విజయ్ సమంత కలిసి కత్తి, తేరి, మెర్సల్ సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది కాబట్టు విజయ్ తో నాలుగోసారి కలిసి నటించడానికి సమంత త్వరలోనే ఓకే చెప్తుందని సమాచారం.