Nagababu : చిరంజీవి మద్దతు జనసేనకే.. మెగా అభిమానుల మద్దతు వారి ఇష్టం.. నాగబాబు వ్యాఖ్యలు..

నాగబాబు మాట్లాడుతూ.. ''చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం జనసేనకు చిరంజీవి మద్దతుగా ఉంటారు. ఎక్కడా పోటీ..................

Nagababu : చిరంజీవి మద్దతు జనసేనకే.. మెగా అభిమానుల మద్దతు వారి ఇష్టం.. నాగబాబు వ్యాఖ్యలు..

Janasena Nagababu

Updated On : June 4, 2022 / 7:26 AM IST

Janasena :  మెగా బ్రదర్ ఇటీవల జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో మరింత యాక్టీవ్ గా అవుతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మెగా అభిమానులతో, జనసేన కార్యకర్తలతో తరచూ మీటింగ్స్ పెట్టి జనసేన గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు.

తాజాగా నాగబాబు విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఓ హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేన కార్యకర్తలతో పాటు పలువురు జిల్లా నాయకులు వచ్చారు. ఆ కార్యక్రమంలో నాగబాబు చిరంజీవి గురించి, పార్టీ గురించి, మెగా అభిమానుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sonali Bindre : డబ్బుల కోసం అలాంటి సినిమాలు చేశాను.. మాజీ స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు..

నాగబాబు మాట్లాడుతూ.. ”చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం జనసేనకు చిరంజీవి మద్దతుగా ఉంటారు. ఎక్కడా పోటీ చేయరు. పొత్తులపై అన్నీ ఆలోచించి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకుంటారు. మెగా అభిమానుల మద్దతు ఎవరికి ఇస్తారు అనేది వారి ఇష్టం. జనసేనకే మద్దతుగా నిలుస్తారనుకుంటున్నాను. జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకే ఈ సమావేశం” అని తెలిపారు.