Sonali Bindre : డబ్బుల కోసం అలాంటి సినిమాలు చేశాను.. మాజీ స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు..

తాజా ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ.. ''ఒకప్పుడు నా కెరీర్ డౌన్ అయ్యే టైంలో, క్యాన్సర్ మొదటి స్టేజిలో ఉన్న టైంలో నాకు చాలా డబ్బులు అవసరం వచ్చేవి. ఇంటి అద్దె కట్టాలి, బిల్లులు కట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి........

Sonali Bindre :  డబ్బుల కోసం అలాంటి సినిమాలు చేశాను.. మాజీ స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు..

Sonali Bindre

Sonali Bindre :   తెలుగులో మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, శంకర్‌దాదా MBBS లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సోనాలి బింద్రే ఒకప్పుడు తెలుగులో, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కెరీర్ సూపర్ దశలో ఉన్నప్పుడు సోనాలి క్యాన్సర్ బారిన పడింది. 2013లో హిందీలో వచ్చిన ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై’ సినిమాలో చివరి సారిగా అతిథి పాత్రలో కనిపించింది సోనాలి. ఆ తర్వాత ఎన్నో కష్టాలని చూసి, క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది.

సోనాలి మళ్ళీ ఇటీవలే రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే పలు బాలీవుడ్ టీవీ షోలలో గెస్ట్ గా, జడ్జిగా కనిపించి అలరించింది. తాజాగా ది బ్రోకెన్‌ న్యూస్‌ అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటించింది. ఈ సిరీస్ జూన్‌ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తుంది సోనాలి. ఈ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించింది. అలాగే మంచి పాత్రలు వస్తే ఏ భాషలోనైనా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటుంది.

Satya : టాలీవుడ్‌లో యువ హీరో మృతి.. తల్లి, భార్య మరణం తట్టుకోలేకే..

తాజా ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ.. ”ఒకప్పుడు నా కెరీర్ డౌన్ అయ్యే టైంలో, క్యాన్సర్ మొదటి స్టేజిలో ఉన్న టైంలో నాకు చాలా డబ్బులు అవసరం వచ్చేవి. ఇంటి అద్దె కట్టాలి, బిల్లులు కట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి.. ఆ సమయంలో నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. అలాంటి సమయంలో డబ్బులు ముఖ్యమని ఫిక్స్ అయ్యాను. దీంతో ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకున్నాను. ఎలాంటి పాత్రలు వచ్చినా చేశాను. ఒక సినిమా అవ్వగానే ఇంకో సినిమా మొదలు పెట్టేదాన్ని. ఆ సినిమాల డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసేదాన్ని. కానీ తర్వాత అనిపించేది ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాను అని కానీ డబ్బులు అవసరం ఉంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా సినిమాలు చేశాను. నేను చేసిన కొన్ని సినిమాలు నేనే చూడలేదు. అలాంటి సినిమాలు చేశాను. కేవలం ఆ సమయంలో డబ్బుల కోసం మాత్రమే అలాంటి సినిమాలు చేశాను” అని తెలిపింది.