Samantha : సమంతతో క్రికెటర్ శ్రీశాంత్..

ఇప్పటికే 'కాతువాకుల రెండు కాదల్' సినిమా నుంచి సమంత, నయనతార, విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.......

Samantha : సమంతతో క్రికెటర్ శ్రీశాంత్..

Samantha

Samantha :  సమంత, నయనతార హీరోయిన్స్ గా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాని నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తుండగా ప్రియుడితో కలిసి నయనతార ఈ సినిమాను నిర్మిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఇప్పటికే ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా నుంచి సమంత, నయనతార, విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది ఎవరో కాదు ఒకప్పటి క్రికెటర్ శ్రీశాంత్. ఒకప్పటి టీం ఇండియా బౌలర్ శ్రీశాంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Mahesh Babu : 17 సంవత్సరాలు.. ఇదంతా ప్రేమతోనే.. మహేష్ పెళ్లిరోజు స్పెషల్ పోస్ట్..

ఇప్పటికే శ్రీశాంత్ గతంలోనే ఒక సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇందులో శ్రీశాంత్ సమంతతో కలిసి నటించనున్నాడు. ఈ సినిమాతో శ్రీశాంత్ మరోసారి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇదే కాకుండా శ్రీశాంత్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడని సమాచారం.