Samsung Galaxy S21 FE : ఫ్లిప్‌కార్ట్‌‌లో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్.. రూ.33,999లకే శాంసంగ్ గెలాక్సీ S21E 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Samsung Galaxy S21 FE : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ (Flipkart Big Saving Days Sale)ను నిర్వహించేందుకు రెడీగా ఉంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఫోన్ డీల్స్ వెల్లడించింది.

Samsung Galaxy S21 FE : ఫ్లిప్‌కార్ట్‌‌లో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్.. రూ.33,999లకే శాంసంగ్ గెలాక్సీ S21E 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Samsung Galaxy S21 FE to be available at an effective price of Rs 33,999 via Flipkart

Samsung Galaxy S21 FE : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ (Flipkart Big Saving Days Sale)ను నిర్వహించేందుకు రెడీగా ఉంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఫోన్ డీల్స్ వెల్లడించింది. Nothing Phone (1), Pixel 6a, Moto Edge 30 వంటి ప్రముఖ 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ టీజర్ పేజీ ప్రకారం.. Samsung Galaxy S21 FE ధర కూడా అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. శాంసంగ్ Galaxy S21 FE ధర రూ. 33,999 వద్ద అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రీమియం 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ అందించదని టీజర్ పేజీ సూచిస్తుంది. ఈ డీల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు బ్యాంక్ కార్డ్ ఆఫర్ రిటైల్ ధరపై ఫ్లాట్ డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం, శాంసంగ్ ఫోన్ రూ. 34,999లకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 49,999 నుంచి తగ్గింది. శాంసంగ్ Galaxy S21 FE ఏళ్ల 5G ఫోన్ గత ఏడాదిలో దాదాపు ఇదే సమయంలో లాంచ్ అయింది. బెస్ట్ కెమెరా సెటప్, వైబ్రెంట్ డిస్‌ప్లే, సాధారణ పనితీరుతో ఫోన్ అవసరమయ్యే యూజర్లకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ, కంపెనీ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించదని గమనించాలి. అలాగే, 25W ఫాస్ట్ ఛార్జ్‌కు మాత్రమే సపోర్టు చేస్తుంది.

Samsung Galaxy S21 FE to be available at an effective price of Rs 33,999 via Flipkart

Samsung Galaxy S21 FE to be available at an effective price 

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Fipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ జనవరి 15న ప్రారంభమవుతుంది. జనవరి 20 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ICICI బ్యాంక్, సిటీ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఆఫర్ వర్తిస్తుంది. శాంసంగ్ Galaxy S21 FE ఫోన్‌తో పాటు, Flipkart అందించే ఇతర 5G ఫోన్‌లపై కూడా లాభదాయకమైన డీల్స్ అందజేస్తుందని కంపెనీ వెల్లడించింది. టీజర్ పేజీ వివరాల ప్రకారం.. Pixel 6a ధర రూ. 27,999లకు అందుబాటులోకి వస్తుంది. ఈ డీల్ బ్యాంక్, ఇతర ఆఫర్‌లపై ఆధారపడి ఉంటుంది. యూట్యూబర్ MKBHD నిర్వహించిన బ్లైండ్ కెమెరా టెస్టులో ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్ కెమెరా ఫోన్ అవార్డును పొందింది.

అదేవిధంగా, నథింగ్ ఫోన్ (1) ధర రూ. 24,999లుగా ఉంది. మోటో Edge 30 ధర రూ. 22,249కి అందుబాటులో ఉంటుంది. Flipkart ప్లాట్‌ఫారంపై Realme 9 5Gని రూ. 12,999 ధరకు విక్రయించనుంది. ఈ అదిరే సేల్ కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. 6 రోజుల పాటు లైవ్‌లో అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ రాబోయే సేల్ ఈవెంట్‌కు దగ్గరగా డీల్‌లు, ఆఫర్‌లపై మరిన్ని వివరాలను అందించనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy A14 : శాంసంగ్ ఈవెంట్‌లో గెలాక్సీ A14 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే భారత్‌లో ధర ఎంతో తెలిసిందోచ్..!