Samsung Galaxy A14 : శాంసంగ్ ఈవెంట్‌లో గెలాక్సీ A14 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే భారత్‌లో ధర ఎంతో తెలిసిందోచ్..!

Samsung Galaxy A14 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అదే.. (Samsung Galaxy A14) ఫోన్.. జనవరి 18న భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A14ఫోన్ లాంచ్ కానుందని భావిస్తున్నారు.

Samsung Galaxy A14 : శాంసంగ్ ఈవెంట్‌లో గెలాక్సీ A14 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే భారత్‌లో ధర ఎంతో తెలిసిందోచ్..!

Samsung Galaxy A14 likely to launch at Samsung’s January 18 event, India price leaked online

Samsung Galaxy A14 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అదే.. (Samsung Galaxy A14) ఫోన్.. జనవరి 18న భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A14ఫోన్ లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ మోడల్ నంబర్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రివీల్ అయింది. ఇటీవలే 5G ఫోన్ అమెరికా మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇప్పుడు భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Galaxy A14 భారతదేశ ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రాబోయే Samsung ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ Galaxy A14 5G ఫోన్ మోడల్.. భారత మార్కెట్లో Galaxy A13 5Gకి సక్సెసర్‌గా రానుంది. శాంసంగ్ హ్యాండ్‌సెట్ 4G వెర్షన్‌ను మాత్రమే ప్రకటించింది. ఈ మోడల్ ఫోన్ రూ. 14,999కి అందుబాటులోకి వచ్చింది. 5G వెర్షన్ అయినందున Galaxy A14 ధర ఎక్కువగా ఉంటుంది. 91Mobiles నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. డివైజ్ బాక్స్ ధర రూ. 22,999 ఉంటుంది. అయితే రిటైల్ ధర రూ. 2వేలు లేదా రూ. 3వేలు కన్నా తక్కువగా ఉంటుంది. Galaxy A14 చాలావరకు Galaxy A13 5G వెర్షన్‌తో చిన్న తేడాతో (స్పెసిఫికేషన్‌లు అమెరికా మార్కెట్‌కు సమానంగా ఉంటే) పోలి ఉన్నందున ధర ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం లేదు.

Samsung Galaxy A14 likely to launch at Samsung’s January 18 event, India price leaked online

Samsung Galaxy A14 likely to launch at Samsung’s January 18 event

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

శాంసంగ్ Galaxy A14 5G హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 700 SoCతో రానుంది. 6.6-అంగుళాల స్క్రీన్ ఉంది. పాత వెర్షన్‌లో కనిపించే 6.5-అంగుళాల ప్యానెల్ కంటే కొంచెం పెద్దది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. స్పీడ్ ఛార్జింగ్ కోసం కంపెనీ సపోర్టును అందించలేదు. చాలా మంది శామ్‌సంగ్ అభిమానులకు నిరాశ కలిగించవచ్చు. కొత్తది 15W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.

శాంసంగ్ రెండు ఏళ్ల మేజర్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను అందజేస్తుందని కంపెనీ తెలిపింది. కెమెరా విభాగంలోనూ అనేక మార్పులు ఉన్నాయి. వెనుక కెమెరా అలాగే ఉంది. ముందు కెమెరా సెక్షన్ 5-MP కెమెరా నుంచి 13-MP సెన్సార్‌కి అప్‌గ్రేడ్ అయింది. వెనుక ప్యానెల్‌లో 50-MP ప్రధాన కెమెరా, 2-MP డెప్త్ సెన్సార్, 2-MP మాక్రో కెమెరా ఉన్నాయి. శాంసంగ్ భారతీయ మోడల్‌ను కొంచెం భిన్నమైన ఫీచర్లతో అందించాలని నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయి.

జనవరి 18న భారతీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A14 హ్యాండ్‌సెట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ ఈ నెల18న భారత్‌లో ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నట్టు ధృవీకరించింది. లేటెస్ట్ గెలాక్సీ A-సిరీస్ ఫోన్‌లను ప్రకటిస్తుంది. కంపెనీ ఇంకా డివైజ్ పేర్లను ధృవీకరించనప్పటికీ.. Galaxy A14 5G, Galaxy A34 5G, Galaxy A54 5G వంటి కొన్ని Samsung Galaxy ఫోన్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. శాంసంగ్ కేవలం ఒక ఫోన్ లేదా మల్టీ ప్రొడక్టులను లాంచ్ చేస్తుందా అనేది తెలియదు. శాంసంగ్ లాంచ్ ఈవెంట్‌కు ముందు కొన్ని టీజర్‌లను పోస్ట్ చేస్తుందని భావిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Motorola Edge 30 Fusion : మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ వివా లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?