Motorola Edge 30 Fusion : మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ వివా లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

Motorola Edge 30 Fusion : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి కొత్త Motorola Edge 30 Fusion (Viva Magenta) లిమిటెడ్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లెనోవా యాజమాన్యంలోని టెక్నాలజీ కంపెనీ వివా మెజెంటా అనే మోడల్ ప్రవేశపెట్టింది.

Motorola Edge 30 Fusion : మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ వివా లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

Motorola Edge 30 Fusion Viva Magenta limited edition launched in India_ Details

Motorola Edge 30 Fusion : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి కొత్త Motorola Edge 30 Fusion (Viva Magenta) లిమిటెడ్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లెనోవా యాజమాన్యంలోని టెక్నాలజీ కంపెనీ వివా మెజెంటా అనే మోడల్ ప్రవేశపెట్టింది. పాంటోన్ కలర్‌లో వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ ప్రపంచంలోనే మొదటిదిగా చెప్పవచ్చు. Motorola రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2022లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ మోడల్‌తో సమానమైన ఫీచర్లను కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 30 Fusion Viva మెజెంటా ధర ఎంతంటే? :
Motorola Edge 30 Fusion Viva Magenta లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 39,999లకు వస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం Flipkart ద్వారా కంపెనీకి చెందిన అధీకృత రిటైల్ స్టోర్లలో జనవరి 12, 2023 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఆసక్తికరంగా, ఆసక్తిగల కస్టమర్‌లు ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ. 3,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్, రిలయన్స్ జియో నుంచి రూ. 7,699 విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు.

మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ Viva Magenta స్పెసిఫికేషన్‌లు ఇవే :
డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ My UX ఇంటర్‌ఫేస్‌తో Android 12పై రన్ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల FHD+ కర్వ్డ్ ఎండ్‌లెస్ ఎడ్జ్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ HDR10+ సపోర్టును అందిస్తుంది. 1,100 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 888+ SoC ద్వారా 8GB LPDDR5 RAMతో వచ్చింది.

Motorola Edge 30 Fusion Viva Magenta limited edition launched in India_ Details

Motorola Edge 30 Fusion Viva Magenta limited edition launched in India

Read Also : Moto X40 Launch Date : భారత్‌కు మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 15న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఆప్టిక్స్ కోసం.. ఈ ఫోన్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఓమ్ని-డైరెక్షనల్ PDAFతో సహా 50 MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. f/1.8 ఎపర్చరు లెన్స్‌తో వచ్చింది. 13 MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు f/2.2 ఎపర్చరు లెన్స్, 120డిగ్రీల వీక్షణ ఫీల్డ్ కూడా ఉంది. మాక్రో విజన్ లెన్స్‌ను కూడా పొందుతుంది. సెల్ఫీల కోసం.. f/2.45 ఎపర్చరు లెన్స్‌తో వచ్చిన 32 MP సెన్సార్‌ను కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 30 Fusion 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీ, WiFi-6E, 5G, 4G LTE, బ్లూటూత్ v5.2, NFC, USB టైప్ C పోర్ట్‌ను పొందుతుంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అదనంగా, వాటర్, డెస్ట్ రెసిస్టెన్స్ కోసం IP52 రేట్ అయింది. డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేసిన డ్యూయల్ మైక్రోఫోన్లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. సెన్సార్లకు యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Motorola Jio 5G : మోటోరోలా ఫోన్లలోనూ జియో 5G అప్‌డేట్.. ఏయే స్మార్ట్‌ఫోన్లలో జియో ట్రూ 5G సపోర్టు చేస్తుందో తెలుసా? ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!