Motorola Jio 5G : మోటోరోలా ఫోన్లలోనూ జియో 5G అప్‌డేట్.. ఏయే స్మార్ట్‌ఫోన్లలో జియో ట్రూ 5G సపోర్టు చేస్తుందో తెలుసా? ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

Motorola Jio 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఫోన్లలో కొత్త 5G అప్‌డేట్ రిలీజ్ అయింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా మోటోరోలా కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో రిలయన్స్ జియో 5G (Reliance Jio 5G) సపోర్టు అన్‌లాక్ అయింది.

Motorola Jio 5G : మోటోరోలా ఫోన్లలోనూ జియో 5G అప్‌డేట్.. ఏయే స్మార్ట్‌ఫోన్లలో జియో ట్రూ 5G సపోర్టు చేస్తుందో తెలుసా? ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

Motorola rolling out update to unlock Jio 5G _ Check out all eligible smartphones

Motorola Jio 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఫోన్లలో కొత్త 5G అప్‌డేట్ రిలీజ్ అయింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా మోటోరోలా కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో రిలయన్స్ జియో 5G (Reliance Jio 5G) సపోర్టు అన్‌లాక్ అయింది. మోటోరోలా రిలయన్స్ జియోతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో Jio True 5G సర్వీసులను మోటోరోలా ఫోన్లలోనూ యాక్సస్ చేసుకోవచ్చు. Jio స్టాండ్-అలోన్ (SA) 5G టెక్నాలజీని అన్‌లాక్ చేసేందుకు కంపెనీ అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం, రిలయన్స్ జియో 5G సర్వీసులు భారత మార్కెట్లో ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు దాని హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఆచరణాత్మకంగా ఉచితంగా పొందవచ్చు. అందుకే జియో ‘Welcome Offer’ని అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్‌లు జియో 5G సర్వీసులను ఉచితంగా పొందవచ్చు. భారతీ ఎయిర్‌టెల్ (Airtel 5G Services) తన 5G Plus సర్వీసులను భారత్ అంతటా విస్తరిస్తోంది.

మోటోరోలా 5G సపోర్టుతో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన ప్రపంచంలోనే మొదటి బ్రాండ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. భారత్‌లో లెనోవా యాజమాన్యంలోని కంపెనీ వేర్వేరు ధరల వద్ద 5G-రెడీ డివైజ్‌‌లను అందిస్తుంది. చాలావరకూ మోటరోలా ఫోన్‌లు భారత్‌లో13-బ్యాండ్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. అందులో చాలా వరకు వివిధ ఫ్రీక్వెన్సీలలో 5G నెట్‌వర్క్‌లను పొందవచ్చు. Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion, Moto G62 5G, Motorola Edge 30, Moto G82 5G, Motorola Edge 30 Pro, Moto G71 5G, Moto G51 5G, Motorola Edge 20, 20 వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Read Also : Motorola 5G Update : మోటోరోలా 5G అప్‌డేట్ ఏయే డివైజ్‌ల్లో వచ్చిందో తెలుసా? అందులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి!

Fusion సపోర్టుతో Jio 5G సర్వీసులను పొందవచ్చు. మోటరోలా ఆసియా పసిఫిక్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి మాట్లాడుతూ.. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు వేగవంతమైన 5G సపోర్టును సరసమైన ధరకే అందిస్తాయని తెలిపారు. జియో ట్రూ 5G సపోర్టుతో భారతీయ యూజర్లకు ఎలాంటి రాజీ లేని 5G స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియో ధరలలో గరిష్టంగా 13 5G బ్యాండ్‌లకు సపోర్టు అందిస్తున్నామని తెలిపారు. అన్ని Motorola స్మార్ట్‌ఫోన్‌లు కూడా Airtel 5G Plus సర్వీసులకు సపోర్టు అందిస్తాయి.

Motorola rolling out update to unlock Jio 5G _ Check out all eligible smartphones

Motorola rolling out update to unlock Jio 5G

ఎయిర్‌టెల్ 5G సర్వీసులు ఇప్పటికే దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ఇండోర్, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, పానిపట్, గురుగ్రామ్, గౌహతి, పాట్నా, లక్నో, సిమ్లా, ఇంఫాల్, అహ్మదాబాద్, వైజాగ్ పూణేలలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రిలయన్స్ జియో 5G సర్వీసులు (Reliance Jio 5G Services) ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, నాథద్వారా, కొచ్చి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, భోపాల్, ఇండోర్, లక్నో, త్రివేండ్రం, లలో అందుబాటులో ఉన్నాయి. మైసూరు, నాసిక్, ఔరంగాబాద్. జియో 5G మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, డేరాబస్సి, గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

Jio, Airtel 5G సర్వీసులను ఎలా ఉపయోగించాలంటే? :
Airtel, Jio 5G సర్వీసులను పొందడం చాలా సులభం. మోటోరోలా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ Android OS లేదా iOS వెర్షన్‌లలో రన్ అవుతున్నట్లు నిర్ధారించుకోవాలి. ఎయిర్‌టెల్ విషయంలో.. మోటోరోలా డివైజ్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రిలయన్స్ జియో విషయంలో మోటో యూజర్లు తమ MyJio యాప్‌ని ఓపెన్ చేసి ‘Jio Welcome Offer’ కోసం Sign Up చేయాలి. రెండు టెల్కోలు 5G సర్వీసులను ఉచితంగా అందిస్తున్నాయి. అందుకే మోటో వినియోగదారులు తమ సిమ్ కార్డ్‌లను మార్చాల్సిన అవసరం లేదని గమనించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy F04 : శాంసంగ్ గెలాక్సీ F04 వచ్చేసిందోచ్.. రూ.7,499లకే సొంతం చేసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?