Samsung Galaxy F04 : శాంసంగ్ గెలాక్సీ F04 వచ్చేసిందోచ్.. రూ.7,499లకే సొంతం చేసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?

Samsung Galaxy F04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ F సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ F04 (Samsung Galaxy F04). ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.

Samsung Galaxy F04 : శాంసంగ్ గెలాక్సీ F04 వచ్చేసిందోచ్.. రూ.7,499లకే సొంతం చేసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?

Samsung Galaxy F04 launched in India with an introductory price of Rs 7499

Samsung Galaxy F04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ F సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ F04 (Samsung Galaxy F04). ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ డివైజ్ జనవరి 12, మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ Galaxy F04 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చిన ఏకైక వేరియంట్ ధర రూ. 7,499 అందుబాటులో ఉండనుంది.

అంతేకాదు.. గెలాక్సీ F04 ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో వస్తుంది. శాంసంగ్ Galaxy F04 ఫోన్ జాడే పర్పుల్, ఒపల్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఆసక్తి గల కస్టమర్‌లు రూ. 7499 ప్రారంభ ధర లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ద్వారా మాత్రమే ఉండనుంది. ఈ ఆఫర్ ముగిసిన తర్వాత శాంసంగ్ Galaxy F04 రూ. 9499కి అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు ఈ కొత్త శాంసంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే వచ్చే వారం Flipkart సేల్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy A34 : శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

శాంసంగ్ గెలాక్సీ F04 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. శాంసంగ్ Galaxy F04 ఫోన్ 16.55cm HD+ డిస్‌ప్లేతో పాటు వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్, స్లిమ్ బెజెల్స్‌తో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ MediaTek P35 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. వర్చువల్ RAM సాయంతో 8GB RAM వరకు విస్తరించవచ్చు. సాఫ్ట్‌వేర్ ముందు.. శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది. బ్రాండ్ 2 ఏళ్ల OS అప్‌గ్రేడ్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.

Samsung Galaxy F04 launched in India with an introductory price of Rs 7499

Samsung Galaxy F04 launched in India with an introductory price of Rs 7499

కొత్తగా లాంచ్ అయిన Samsung ఫోన్ 2MP సెకండరీ కెమెరాతో పాటు 13-MP ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ముందు భాగంలో, ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5-MP కెమెరాను కలిగి ఉంది. దీనికి 5000mAh బ్యాటరీ సెటప్ ఉంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు.

శాంసంగ్ Galaxy F04 డిజైన్ కూడా సరసమైన ధరతో రానుంది. వెనుక ప్యానెల్‌లో, ఫోన్‌లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. కానీ, కెమెరా మాడ్యూల్ లేదు. డిజైన్ ధరకు ప్రీమియంగా కనిపిస్తుంది. కెమెరా సిస్టమ్ LED ఫ్లాష్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఫోన్ డిజైన్ ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోల్చినప్పుడు వాటర్‌డ్రాప్ నాచ్, అందంగా స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉంది.

శాంసంగ్ కంపెనీ నుంచి Galaxy S23 సిరీస్‌ని ఫిబ్రవరి 1న ప్రకటించనుంది. దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2023కి సంబంధించిన అధికారిక తేదీని ఇంకా వెల్లడించలేదు. రాబోయే కొద్ది రోజుల్లో Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra అనే మూడు కొత్త మోడల్‌లను పెద్ద అప్‌గ్రేడ్‌లతో లాంచ్ చేయనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Big TV Days Sale : శాంసంగ్ బిగ్ టీవీ డేస్ సేల్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, అదిరే క్యాష్‌బ్యాక్స్, మరెన్నో బెనిఫిట్స్..!