Bheemla Nayak : పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో అదరగొట్టిన హీరోయిన్ సంయుక్త మీనన్

మలయాళ భామ, హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ''కేరళలో చిన్న ఊరిలో పుట్టి ఇక్కడ స్టేజి మీద మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. నాకు తెలుగు సినిమాలో ఇంతకన్నా బెస్ట్ ఇంట్రడ్యూస్ లేదు......

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో అదరగొట్టిన హీరోయిన్ సంయుక్త మీనన్

Samyuktha

Samyuktha Menon :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.

మలయాళ భామ, హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ”కేరళలో చిన్న ఊరిలో పుట్టి ఇక్కడ స్టేజి మీద మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. నాకు తెలుగు సినిమాలో ఇంతకన్నా బెస్ట్ ఇంట్రడ్యూస్ లేదు. చాలా ఎగ్జైట్ గా ఉంది ఈ సినిమాలో నటించినందుకు. నా క్యారెక్టర్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు. కానీ నేను భీమ్లా నాయక్ సినిమాలో పవన్ గారితో, రానా గారితో నటించినందుకు చాలా సాధించిన ఫీలింగ్ ఉంది. ఈ సినిమాతో సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు సపోర్ట్ చేసిన అందరు టెక్నీషియన్స్ కి చాలా థ్యాంక్స్. ఖుషి నుంచి పవన్ సర్ ని చూస్తూ పెరిగాను. బాహుబలి రానా గారితో, త్రివిక్రమ్ గారితో, అలవైకుంఠపురం సాంగ్స్ ఇప్పటికి వింటాను అలంటి పాటలు ఇచ్చిన తమన్ గారితో, కెమరామెన్ రవి చంద్రన్ గారితో కలిసి పని చేయడం అదృష్టం. మనం పెద్ద కలలు కనాలి వాటి కోసం కష్టపడాలి.” అని తెలిపింది.

Ramajogayya shastri : ‘భీమ్లా నాయక్’ పాటలన్నీ మూడు రోజుల్లో రాశాను

”ఈ సినిమాకి నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను తెలుగులో. నా మొదటి సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. పవన్ గారు ఎప్పుడు ధైర్యం నింపుతారు నాలో. పవన్ గారు చెప్పిన మాటలు ఎప్పుడు వింటూ ఉంటాను.” అని పవన్ కళ్యాణ్ స్పీచ్ లలో ఎక్కువగా వినిపించే.. ”ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ నా ధైర్యమే కవచం.. నా ధైర్యమే ఆయుధం..” అని చెప్పి మీ అందరికి భీమ్లా నాయక్ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అని తెలిపింది.