Ramajogayya shastri : ‘భీమ్లా నాయక్’ పాటలన్నీ మూడు రోజుల్లో రాశాను

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. '' పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్లో పని చేయడం నా అదృష్టం. వీరి ముగ్గురికి విడివిడిగా పని చేశాను.......

Ramajogayya shastri : ‘భీమ్లా నాయక్’ పాటలన్నీ మూడు రోజుల్లో రాశాను

Rama Jogayya

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.

Pawan Kalyan : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిన్నెర మొగులయ్యకి సన్మానం

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్లో పని చేయడం నా అదృష్టం. వీరి ముగ్గురికి విడివిడిగా పని చేశాను. ఈ సినిమాతో మొదటి సారి కలిసి పని చేశాను. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు రాశాను. ఈ మూడు పాటలు మూడు రోజుల్లోనే రాశాను. వాటికి తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. పాటలు బాగా హిట్ అయ్యాయి. త్రివిక్రమ్, పవన్ ఇద్దరూ కళలని ప్రోత్సహిస్తారు. కిన్నెర మొగులయ్య లాంటి వారిని ప్రోత్సహించారు.” అని తెలిపారు.