Shamshera : సినిమా చూడకుండానే ఫ్లాప్ అంటున్నారు.. షంషేరా సినిమాపై సంజయ్ దత్ ఎమోషనల్ పోస్ట్..

సంజయ్‌ దత్‌ ఈ లేఖలో.. ''షంషేరా చాలా గొప్ప సినిమా. మా చెమట, రక్తం, కన్నీళ్లు ధారపోసి ఈ సినిమా చేశాం. దీన్ని వెండితెరపైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. కానీ చాలామంది ఈ సినిమాని చూడకుండానే........

Shamshera : సినిమా చూడకుండానే ఫ్లాప్ అంటున్నారు.. షంషేరా సినిమాపై సంజయ్ దత్ ఎమోషనల్ పోస్ట్..

Sanjay Dutt

Sanjay Dutt :  రణబీర్ కపూర్, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో స్వాతంత్య్రం ముందు కథతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా షంషేరా. ఈ సినిమా జూలై 22న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూడటంతో భారీగా హిట్ అవుతుంది, బాలీవుడ్ ట్రాక్ లో పడుతుంది అని భావించారు అంతా. కానీ షంషేరా సినిమా ప్రేక్షకులని మెప్పించలేక చతికిలపడింది. ఈ భారీ బడ్జెట్ సినిమాకి మినిమమ్ కలెక్షన్లు కూడా రాకపోవడంతో మారోసారి బాలీవుడ్ ఖంగుతింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సంజయ్ దత్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేశారు.

Samantha : చైతూతో కలిసి ఉన్న ఇంటిని ఎక్కువ డబ్బిచ్చి కొనుక్కున్న సమంత

సంజయ్‌ దత్‌ ఈ లేఖలో.. ”షంషేరా చాలా గొప్ప సినిమా. మా చెమట, రక్తం, కన్నీళ్లు ధారపోసి ఈ సినిమా చేశాం. దీన్ని వెండితెరపైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. కానీ చాలామంది ఈ సినిమాని చూడకుండానే నెగిటివ్ ప్రచారం చేశారు. ఫ్లాప్ అని ప్రచారం చేశారు. మా కష్టాన్ని లెక్కచేయకుండా ఇలా ప్రచారం చేయడం చాలా బాధగా ఉంది. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో నేను ఎంతోమందితో డైరెక్టర్స్ తో పనిచేశాను. అందులో కరణ్‌ ఓ గొప్ప డైరెక్టర్‌. మేము ఇద్దరం గతంలో అగ్నిపథ్‌ సినిమా చేశాం. అందులోని నా కంచ చీనా పాత్ర బాగా వర్కవుట్‌ అయింది. దాంతో నన్ను నమ్మి షంషేరాలో అవకాశం ఇచ్చాడు. సినిమా సక్సెసా? ఫెయిల్యూరా? పక్కనపెడితే అతడు నాకు ఫ్యామిలీలో భాగమే. అతడితో కలిసి పని చేయడం నాకు గౌరవం. నేను అతనికి సపోర్ట్ చేస్తాను. కరోనా వంటి ఇబ్బందులు ఎదురైనా నాలుగేళ్లుగా ఒకేతాటిపై నిల్చున్న చిత్రయూనిట్‌ సంకల్పానికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమాతో రణ్‌బీర్‌తో నాకు కలకాలం నిలిచిపోయే అనుబంధం ఏర్పడింది. ఇలాంటి టాలెంటెడ్‌ నటులు, టెక్నీషియన్స్ చేసిన సినిమా మీద కొంతమంది నెగిటివ్ ప్రచారం చేయడం నాకు చాలా బాధ కలిగిస్తుంది” అని తెలిపారు.