Santanu Hazarika : శృతిహాసన్‌తో నా పెళ్లి అయిపొయింది..

శ్రుతీహాసన్‌ బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''శృతితో నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కాకపోతే క్రియేటివ్‌గా మా పెళ్లి జరిగిపోయింది. అందుకు నిదర్శనం మా..........

Santanu Hazarika : శృతిహాసన్‌తో నా పెళ్లి అయిపొయింది..

Shruthi

 

Santanu Hazarika :  కమల్ హాసన్ కూతురు, హీరోయిన్ శృతి హాసన్ ఇప్పటికే ప్రముఖ చిత్రకారుడు, ర్యాపర్ శంతను హజారికాతో రిలేషన్ షిప్ లో ఉందని అందరికి తెలుసు. తానే అధికారికంగా పోస్ట్ చేసింది కూడా. ఇక అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేసే ఫోటోలు, టూరింగ్ ప్లేసెస్ కి వెళ్లిన ఫోటోలు, పార్టీ చేసుకునే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది శృతి. తాజాగా శృతి బాయ్ ఫ్రెండ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపాడు.

 

శ్రుతీహాసన్‌ బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”శృతితో నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కాకపోతే క్రియేటివ్‌గా మా పెళ్లి జరిగిపోయింది. అందుకు నిదర్శనం మా బలమైన బంధమే. మేమిద్దరం క్రియేటివ్‌ పీపుల్‌. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను షేర్ చేసుకొని క్రియేట్‌ చేయాలనుకుంటాం. నా జీవితంలో శృతి ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే తాను కూడా నన్ను చూసి ఇన్‌స్పైర్‌ అవుతుంది. మా క్రియేటివ్‌ ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయి. ఇక ప్రత్యక్షంగా మా వివాహం ఎప్పుడు జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు కానీ క్రియేటివ్ గా మాత్రం మా పెళ్లి అయిపోయినట్టే” అని తెలిపాడు.

Kartik Aaryan : గులాబీలతో యువ హీరో వెంటపడ్డ అమ్మాయిలు.. సిగ్గుపడుతూనే ఫొటోలిచ్చిన హీరో

అంటే ఇద్దరి మనుసులు, ఆలోచనలు కలిసి ఒకరికోసం ఒకరు కలిసి ఉంటున్నారు అని చెప్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు కలిసి ఉంటున్నారు, మరి అధికారికంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఇద్దరూ వారి వర్క్స్ తో బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్న కూడా అప్పుడప్పుడు వాళ్ళ ప్రేమకి సమయం కేటాయిస్తున్నారు.