Sara Alikhan : కలెక్షన్లన్నీ నిర్మాతలకే వెళ్తాయి.. మాకేం ఇవ్వరు.. బాలీవుడ్ హీరోయిన్ వ్యాఖ్యలు..

సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకు తానుగా అవకాశాలు తెచ్చుకుంటూ ఎదుగుతుంది బాలీవుడ్ భామ సారా అలీఖాన్. ఇటీవల ఐఫా వేడుకల్లో

Sara Alikhan : కలెక్షన్లన్నీ నిర్మాతలకే వెళ్తాయి.. మాకేం ఇవ్వరు.. బాలీవుడ్ హీరోయిన్ వ్యాఖ్యలు..

Sara Alikhan

Sara Alikhan :  ఇటీవల కొన్ని సినిమాలు బాగా కలెక్షన్స్ వస్తున్నాయి. సాధారణంగా సినిమాలో నటించే వారికి, పని చేసే వారికి ముందుగానే రెమ్యునరేషన్స్, శాలరీ, రోజు వారి వేతనం రూపంలో ఇస్తారు. ఇక సినిమాకి లాభం వచ్చినా, నష్టం వచ్చినా నిర్మాతకే. సాధారణంగా సినిమాకి లాభాలు కానీ నష్టాలు కానీ వస్తే డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకే చెందుతాయి. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ దీనిపై కామెంట్స్ చేసింది.

సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకు తానుగా అవకాశాలు తెచ్చుకుంటూ ఎదుగుతుంది బాలీవుడ్ భామ సారా అలీఖాన్. ఇటీవల ఐఫా వేడుకల్లో సారా ట్రెడిషినల్ దుస్తుల్లో మెరిసింది. తాజాగా సారా అలీఖాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల కలెక్షన్స్ గురుంచి అడిగితే.. ”సినిమాలకి ఎన్ని వసూళ్లు వచ్చినా అవి నిర్మాతలే వెళ్తాయి. అందులో మాకొచ్చేది ఏమి లేదు, మాకేమి ఇవ్వరు. కాబట్టి సినిమా కలెక్షన్స్ తో మాకేమి సంబంధం లేదు” అని తెలిపింది. దీంతో సారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Virataparvam : హీరోయిన్ సినిమా కావడంతో వేరే హీరోలు నో చెప్పారని తెలిసి..

అలాగే సారా అలీఖాన్‌ డ్రీం పాత్రల గురించి అడగగా.. ”సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో మహారాణి పాత్రలో నటించాలి. జోయా అక్తర్‌ సినిమాల్లో మోడరన్‌ గర్ల్‌ క్యారెక్టర్‌ అయినా చేయాలనుంది” అని తెలిపింది.