Virataparvam : హీరోయిన్ సినిమా కావడంతో వేరే హీరోలు నో చెప్పారని తెలిసి..

రానా మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు నిర్మాతగా ఉంటానేమో అని దర్శకుడు నాకు మూడు పేజీల్లో స్క్రిప్టు పంపించాడు. అది చదివాను. హీరోయిన్ చుట్టే కథ తిరుగుతుంది. దీని గురించి..............

Virataparvam : హీరోయిన్ సినిమా కావడంతో వేరే హీరోలు నో చెప్పారని తెలిసి..

Virataparvam

Updated On : June 7, 2022 / 9:52 AM IST

Sai pallavi :  రానా, సాయి పల్లవి జంటగా , ప్రియమణి ముఖ్య పాత్రలో వస్తున్న సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, రానా కలిసి నిర్మించారు. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవ్వబోతుంది. మొదటి నుంచి డైరెక్టర్, రానా ఈ సినిమాలో సాయి పల్లవి మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి చుట్టే కథ తిరుగుతుందని, సాయి పల్లవి బాగా యాక్ట్ చేసిందని చెప్తూనే వచ్చారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులంతా అందులో సాయి పల్లవి నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు. సినిమా మొత్తం సాయి పల్లవి చుట్టే తిరుగుతుందని అర్థమైపోయింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమాలో ముందు చాలా మంది హీరోలు అనుకున్నారట కానీ కథ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతుందని నో చెప్పారంట. అలాగే రానాని అసలు హీరో క్యారెక్టర్ కోసం సంప్రదించలేదట. నిర్మాతగా చేస్తారేమో అని ట్రై చేస్తే ఇలా కుదిరింది. తాజగా విరాటపర్వం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో రానా ఈ విషయం తెలిపాడు.

Sai Pallavi : విరాటపర్వం ప్రమోషన్స్ లో సాయి పల్లవి

రానా మాట్లాడుతూ.. ”ఈ సినిమాకు నిర్మాతగా ఉంటానేమో అని దర్శకుడు నాకు మూడు పేజీల్లో స్క్రిప్టు పంపించాడు. అది చదివాను. హీరోయిన్ చుట్టే కథ తిరుగుతుంది. దీని గురించి ఆరా తీస్తే డైరెక్టర్ వేణు ఇప్పటికే చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లాడని నాయికా ప్రాధాన్య చిత్రం కావడంతో చాలా మంది ఇందులో హీరోగా నటించడానికి నో చెప్పారని తెలిసింది. నాకు ఈ కథ నచ్చింది. నేను మొదటి నుంచి కూడా హీరో కాకుండా నటనని చూసుకొనే సినిమాలు చేస్తున్నాను. అందుకే హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏది చేయడానికి అయినా రెడీ కథ బాగుంటే. ఈ కథ నాకు నచ్చడంతో నిర్మాతగా ఉంటూనే హీరోగా కూడా చేస్తాను అని చెప్పను. దానికి వేణు కూడా వెంటనే ఓకే అన్నాడు. ఇక సాయి పల్లవి నటన, క్రేజ్ అందరికి తెలిసిందే. సాయి పల్లవి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె చాలా మంచి మనిషి. సాయి పల్లవి మంచితనం వల్ల ఇప్పుడు నేను కూడా మంచోడిలా ఫీలవుతున్నాను’’ అని తెలిపారు.