Viral video: నడిరోడ్డుపై తన్నుకున్న లేడీ స్టూడెంట్స్.. వైరల్‌గా మారిన వీడియో

నడిరోడ్డుపై విద్యార్థులు తన్నుకున్నారు.. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు.. కొందరు కర్రలతో కొట్టుకున్నారు.. ఇక్కడ తన్నుకుంది మగ పిల్లలు కాదు.. ఆడ పిల్లలు.. జుట్లు పట్టుకొని మరీ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు...

Viral video: నడిరోడ్డుపై తన్నుకున్న లేడీ స్టూడెంట్స్.. వైరల్‌గా మారిన వీడియో

Student Fignt

Viral video: నడిరోడ్డుపై విద్యార్థులు తన్నుకున్నారు.. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు.. కొందరు కర్రలతో కొట్టుకున్నారు.. ఇక్కడ తన్నుకుంది మగ పిల్లలు కాదు.. ఆడ పిల్లలు.. జుట్లు పట్టుకొని మరీ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అడ్డుకొనేందుకు వెళ్లినవారిసైతం పక్కకు తోసి మరీ తన్నుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. కానీ స్ట్రీట్ ఫైట్ లో పాల్గొన్న విద్యార్థినులు మాత్రం బెంగళూరులోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు, స్కూల్ బయటనే ఇరువర్గాలుగా విడిపోయి దాడికి పాల్పడ్డారు.

విద్యార్థులు తన్నుకుంటున్న సమయంలో వీడియో తీసిన ఓ వ్యక్తి దాని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘర్షణ సమయంలో కొంత మంది స్కూల్ యూనిఫాంలో ఉండగా, మరికొందరు క్యాజువల్స్‌ డ్రస్ లో ఉన్నారు. వారిలో ఒకరు బేస్ బాల్ బ్యాట్ తీసుకొని మరోవర్గంలోని వ్యక్తులపై దాడిచేయడం వీడియోలోకనిపించింది. ఈ గొడవను నివారించేందుకు పక్కనే ఉన్న అబ్బాయిలు ప్రయత్నం చేశారు. అయినా ఆగకుండా స్ట్రీట్ ఫైట్ ను కొనసాగించారు.

Street Fight : నడిరోడ్డుపై పిడిగుద్దులతో రెచ్చిపోయిన యువతులు

ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాదాపు 20 నిమిషాల పాటు ఈ గొడవ కొనసాగింది. కొంతమంది నెటిజన్లు యూనిఫాంను బట్టి బాలికలు బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలకు చెందినవారని ట్వీట్లు చేశారు. అయితే పాఠశాల నుండి ఈ ఘర్షణ అంశంపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.